Sunday, May 12, 2024
Homecinemapathaan movie review : 'పఠాన్‌' తెలుగు మూవీ రివ్యూ

pathaan movie review : ‘పఠాన్‌’ తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

pathaan movie review :’పఠాన్‌’ తెలుగు మూవీ రివ్యూ

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (shahrukh khan) వైవిధ్య‌మైన‌ సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షా అయ్యాడు. సుధీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో అశేష అభిమానగనాన్ని సంపాదించుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. ఈ బాలీవుడ్ బాద్ షా సినిమాకి ఇటీవ‌ల సక్సెస్‌లు పెద్ద‌గా రావ‌డం లేదు. మంచి హిట్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ ‘పఠాన్ గా ప‌ల‌క‌రించాడు. మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం.
pathaan movie rating : 3/5. 

క‌థ‌:

సాధారణంగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సినిమాలు యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా రూపొందుతుంటాయి అనే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు షారూఖ్ నటించిన ‘పఠాన్’ కూడా అదే పంథాలో రూపొందింది. డేంజరస్ సింథటిక్ వైరస్ రిలీజ్‌ను నిరోధించేందుకు ఒక అండర్ కవర్ కాప్, మాజీ నేరస్తుడు కలిసి నిర్వహించే మిషన్‌ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మిష‌న్ లో ఎవ‌రు విజ‌యం సాధించారు. ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అంటే సినిమా చూడాల్సిందే.

ప‌ర్‌ఫార్మెన్స్:

చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఆయ‌న న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఒంటి చేత్తో సినిమాని పైకి లేపాడు. ప్ర‌తి స‌న్నివేశంలోను షారూఖ్ అద‌ర‌గొట్టాడు. ఇక ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఆమె త‌న న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్‌తోను ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసింది. ప్ర‌తి స‌న్నివేశంలోను ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతున్నారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేయ‌గా, అత‌ను కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సీనియర్ నటి డింపుల్ కపాడియా మరియు అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మిగ‌తా పాత్రధారులు కూడా అద్భుతంగానే న‌టించారు.

ప‌ఠాన్ని చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఎక్క‌డ కూడా కాంప్ర‌మైజ్ కాకుండా అత్య‌ద్భుతంగా సినిమాని రూపొందించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించ‌గా, ఆయ‌న పాట‌లు సినిమాకి చాల ప్ల‌స్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం మ‌రో లెవ‌ల్ అని చెప్పాలి. ఏయే స‌న్నివేశాల‌ని ఎలా పొందుప‌ర‌చాలో సినిమాలో అలానే చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు.

-Advertisement-

ప్లస్ పాయింట్స్:

షారూఖ్ న‌ట‌న
సంగీతం
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్:

సాగ‌దీత స‌న్నివేశాలు

విశ్లేషణ‌:

చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్‌లో షారూఖ్ ఖాన్ మాజీ రా ఫీల్డ్ ఏజెంట్‌గా కనిపించి అల‌రించాడు. అతను తన మాతృభూమి భారతదేశం ప్రమాదంలో ప‌డింద‌ని తెలుసుకొని రక్షించడానికి వస్తాడు . పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక్క‌గా, ఈ సినిమాలో హై ఆక్టెన్ స్టంట్స్ ఉన్నాయి. షారుక్ ఖాన్ ఎంట్రీ అయితే పైసా వసూల్ గా ఉంటుంది. ఎక్సలెంట్ డైరెక్షన్ తో ఎంగేజింగ్ గా ఉండే కథ. షారుక్ ఖాన్, జాన్ అబ్రహం సన్నివేశాల్లో వచ్చే బీజీఎం థ్రిల్లింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తన ఊహ చిత్రంగా తెరకెక్కించిన ఈ స్పై సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంది.

also read: 

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

బ్లాక్‌ టీ తో అబ్బుర పరిచే లాభాలు.. రోజూ ఉదయం ఇలా తీసుకోండి!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News

పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక్క‌గా, ఈ సినిమాలో హై ఆక్టెన్ స్టంట్స్ ఉన్నాయి. షారుక్ ఖాన్ ఎంట్రీ అయితే పైసా వసూల్ గా ఉంటుంది. ఎక్సలెంట్ డైరెక్షన్ తో ఎంగేజింగ్ గా ఉండే కథ. షారుక్ ఖాన్, జాన్ అబ్రహం సన్నివేశాల్లో వచ్చే బీజీఎం థ్రిల్లింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తన ఊహ చిత్రంగా తెరకెక్కించిన ఈ స్పై సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంది.pathaan movie review : 'పఠాన్‌' తెలుగు మూవీ రివ్యూ