One Rupee Biryani News : రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాభంగం.. త్వరపడండి.. మీ వద్ద పాత రూపాయి నోటు ఉందా.. అది తీసుకొని వస్తే వేడి వేడి బిర్యానీ మీ సొంతం చేసుకోవచ్చు.. రూపాయి నోటు తీసుకురండి.. ఘుమఘుమలాడే బిర్యానీ పట్టుకెళ్లండి.. ఇదీ మార్కాపురంలో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా హోటల్ యాజమాన్యం ఇచ్చిన బంపర్ ఆఫర్.
ఇది చూసిన మార్కాపురం వాసులు ఆ హోటల్ వద్ద క్యూ కట్టారు. తమ ఇళ్లలో దాచి పెట్టిన రూపాయి నోట్లను తీసుకొని రెస్టారెంట్ వద్దకు చేరుకోసాగారు. జనం తండోపతండాలుగా రావడంతో హోటల్ యాజమాన్యం అవాక్కయ్యింది. తర్వాత ట్విస్టులు మీరే చదవండి..
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్‌ను ఓ రెస్టారెంట్ ప్రకటించడం సంచలనం రేపింది. పట్టణంలోని మొఘల్ బిర్యానీ హౌస్ ఓపెనింగ్ సందర్భంగా యాజమాన్యం ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో చికెన్ బిర్యానీ ప్రియులు భారీగా ఆసక్తి కనబరిచారు. రెస్టారెంట్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటనతో పెద్ద సంఖ్యలో జనం రూపాయి నోటు చేత పట్టుకొని క్యూలైన్‌లో నిల్చున్నారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం జనానికి షాక్ ఇచ్చింది.
Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!
ఇక ఈ ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఇది గమనించిన స్థానికులంతా రూపాయి నోటుతో అక్కడికి చేరుకోవడంతో కోలాహలం ఏర్పడింది. మండుటెండను కూడా లెక్కచేయక క్యూలైన్లలో వేచి చూశారు. దీంతో జనం తాకిడిని తట్టుకోలేక రెస్టారెంట్ షట్టర్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చింది.
ఆఖరికి రూపాయి నోటు తెచ్చిన వారికి చిన్న పాటి కౌంటర్ లాంటిది ఏర్పాటు చేసి బిర్యానీ పార్సిల్ ఇచ్చి పంపారు. ఇక ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న స్థానికులతో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల వారు కూడా దీనిపై విపరీతమైన ఆసక్తి కనబరిచారు. భారీ సంఖ్యలో జనం రావడంతో హోటల్ యాజమాన్యం ట్విస్ట్ ఇచ్చింది.
Mrunal Thakur sets the internet on fire with her beach pictures
పాత రూపాయి నోటు తెస్తేనే చికెన్ బిర్యానీ ఇస్తామంటూ షరతు విధించారు. దాని తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకే బిర్యానీ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయినప్పటికీ జనం తాకిడి తగ్గకపోగా మరింత పెరిగిపోయారు. దీంతో హోటల్ యాజమాన్యం షాక్‌కు గురయ్యింది. తమ ఇళ్లలో దాచిన పాత నోట్లను వెతికి మరీ మొఘల్ బిర్యానీ హౌస్‌కు చేరుకుంటుండడంతో ఇక చేసేది లేక కాసేపటికే రెస్టారెంట్‌ను ఆపేయాల్సి వచ్చింది.