HomecinemaChiranjeevi: ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో త‌దుప‌రి సినిమా చేయ‌నున్న‌ చిరంజీవి

Chiranjeevi: ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో త‌దుప‌రి సినిమా చేయ‌నున్న‌ చిరంజీవి

Telugu Flash News

Chiranjeevi: మొత్తానికి చిరంజీవి వ‌రుస సినిమాలు చేస్తూ అభిమానుల‌కి మాత్రం మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధం అవుతున్నాడు. సూపర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ హిట్ పొందిన చిరు ప్రస్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే భోళా శంక‌ర్ తర్వాత చిరు ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని చ‌ర్చ న‌డుస్తుండ‌గా, తనకు రెండు మైల్ స్టోన్ మూవీస్ ఇచ్చిన వీవీ వినాయక్, తన అభిమాని పూరి జగన్నాథ్ తో సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ యంగ్ డైరక్టర్ కు చిరు ఓకే చెప్పినట్లు ఫిలిం న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించిన వశిష్ట డైరెక్టర్ గా మారి బింబిసార సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నారు .ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ట ఈ సినిమాను డీల్ చేయడంతో అత‌డిని చిరంజీవి పిలిచి ఈ దర్శకుడికి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వరస పెట్టి చిన్న సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్న పెద్ద బ్యానర్ నిర్మించనుందని టాక్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News