Saturday, May 4, 2024
HomeSpecial StoriesChristmas:డిసెంబర్‌ 25, 26 నే క్రిస్మస్‌,బాక్సింగ్‌ డే.. ప్రత్యేకతలేంటి ?

Christmas:డిసెంబర్‌ 25, 26 నే క్రిస్మస్‌,బాక్సింగ్‌ డే.. ప్రత్యేకతలేంటి ?

Telugu Flash News

క్రైస్తవులు జరుపుకొనే ఏకైక ప్రముఖ పండుగ క్రిస్మస్‌ (Christmas). ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది క్రిస్టియన్లు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అనాదిగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ప్రత్యేకించి డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. క్రైస్తవ మతానికి సంబంధించి ఏసు క్రీస్తు జననంపై అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

వాటిలో ఏసుక్రీస్తు పుట్టిన రోజుకు సంబంధించి క్రైస్తవ మత ఆచారం ప్రకారం.. డిసెంబర్‌ 25 న మేరీ మాతకు ఏసు క్రీస్తు జన్మించాడని నమ్ముతారు. మేరీ మాతకు ఓ కల వచ్చింది. బాల యేసును కాబోయే యూదుల రాజుగా పరిగణించి హేరోదు చక్రవర్తి అతడిని సంహరించాలని ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మేరీ, జోసెఫ్‌.. వారికి దూరంగా బెత్లేహాం వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో చాలా కాలం అక్కడే ఉండిపోతారు.

తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి చేరుకోగా.. వారికి ఆశ్రయం దొరకడం కష్టం అవుతుంది. ఈ క్రమంలో ఓ సత్రంలో వారికి పశువుల పాకలో ఉండాల్సి వస్తుంది. అప్పుడే పశువుల కొట్టంలో మేరీ మాత ఏసు క్రీస్తుకు జన్మనిస్తుంది. ఆ రోజు రాత్రే వినీలాకాశం నుంచి ఓ దేవదూత వారి దగ్గరకు వస్తాడు. దీంతో అక్కడే ఉన్న గొర్రెల కాపర్లు ప్రకాశవంతమైన వెలుగును చూసి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురవుతారు. దీంతో దేవదూత స్పందించి ఖంగారు పడకండి అని ధైర్యం చెబుతాడు. బెత్లేహామ్‌లో లోక రక్షకుడు జన్మించాడని, తనే ఇకపై మీకు ప్రభువని హితవు పలుకుతాడు. తర్వాత పాటలు పాడి మాయమైపోతాడు.

ఇలా రెండు వేల సంవత్సరాల క్రితం డిసెంబర్‌ 24వ తేదీన అర్ధరాత్రి తర్వాత ఏసు జన్మించాడని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఏటా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

బాక్సుల్లో బహుమతులు..

క్రిస్మస్‌ మరుసటి రోజైన డిసెంబర్‌ 26వ తేదీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదే బాక్సింగ్‌ డే. ఇంగ్లాండ్‌లో 1800లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిష్టించిన నేపథ్యంలో బాక్సింగ్‌ డే అని పేరు వచ్చింది. ఇదే సమయంలో క్రిస్మస్‌ తర్వాతి రోజు పేద వారికి ధనికులు బాక్సుల్లో బహుమతులు ఇచ్చేవారు. అదే రోజు పని వారికి సెలవు ప్రకటించేవారు. ఇదే నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం పిల్లలకు బాక్సుల్లో బహుమతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఐరోపా దేశాల్లోని చర్చిలు బాక్సుల్లో డబ్బులు సేకరించేవి. బాక్సింగ్‌ డే రోజు ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేవి. ఇలా క్రిస్మస్‌ తర్వాతి రోజును బాక్సింగ్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News