Thursday, May 9, 2024
Homeviral newsViral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

Telugu Flash News

Viral Video : ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు యువతకు చాలా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా కొందరు రోడ్డుపై బైక్‌ను అలా ఇలా నడుపుకుంటూ వెళ్తుంటారు. వేగంగా వెళ్తూ అందరి దృష్టిలో పడాలని, బైక్‌ నడపడంలో తాము ఎక్స్‌పర్టులమని చెప్పేందుకు ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో రకరకాల వేషాలు వేస్తుంటారు.

ఇందులో భాగంగానే రోడ్డుపై వాహనాల రాకపోకలు, చుట్టుపక్కల మనుషులను కూడా గమనించక ఫీట్లు చేస్తూ.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ఓ యువకుడు బైక్‌పై ముందో యువతి, వెనకో యువతిని ఎక్కించుకొని నడిరోడ్డుపై అర్ధరాత్రి వేళ ఫీట్లు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా యువకులు బైక్‌లపై వేగంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక బైక్‌పై ప్రియురాలో, గర్ల్‌ ఫ్రెండో ఎక్కిందంటే ఇక కళ్లు కనిపించవన్న విధంగా కొందరి డ్రైవింగ్‌ ఉంటుంది. ఈ ఘటనలో కూడా ఓ యువకుడు ఇద్దరు యువతులను బైక్‌పై ఎక్కించుకొని విన్యాసాలు చేయడం చూడొచ్చు. ముందువైపు ఓ యువతిని, వెనుకవైపు ఓ యువతిని కూర్చోబెట్టుకొని నడిరేయి వేళ ఈ అబ్బాయి చేసిన నిర్వాకంపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.

వైరల్‌గా మారిన ఈ ఈ ఘటన ముంబై నగరంలో చోటు చేసుకుంది. ఇద్దరు యువతులను ఎక్కించుకొని తలపై హెల్మెట్‌ కూడా లేకుండా విన్యాసాలు చేశాడు.ఈ ఘటనను చూసిన ప్రయాణికులు, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అవాక్కయ్యారు. విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీరిని చూసి మిగతా వారంతా ముక్కున వేలేసుకున్నారు.

బైక్‌ను కాసేపు మామూలుగానే నడిపిన ఆ యువకుడు.. తర్వాత చక్రాన్ని పైకి లేపుతూ స్టంట్స్‌ చేశాడు.ఇలా చేయవద్దంటూ వారించాల్సిన యువతులు.. అతడికి సపోర్ట్‌ చేస్తూ.. మరింత రెచ్చగొట్టారు. కేకలు, ఈలలు వేస్తూ జోష్‌ పెంచడంతో యువకుడు ముందు చక్రాన్ని గాల్లో లేపుతూ బైక్‌ను నడిపాడు.ఇక ఈ యువకుడి తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినప్పటికీ వారు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా మైకంలో మునిగితేలారు. ఈ ఘటన మొత్తం ఇంకో వాహనంలో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్‌ పెట్టారు. వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేస్తూ.. ఈ ఘటన బీకేసీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని వెల్లడించారు. యువకుడి కోసం గాలిస్తున్నామని, ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని సూచించారు.

-Advertisement-

also read :

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బ్రేక‌ప్ చెప్పిన ర‌ష్మిక‌.. కొత్త హీరోతో రిలేష‌న్‌లో నేష‌న‌ల్ క్రష్ ..!

Salman Khan: అంద‌రి ముందే హీరోయిన్‌కి స‌ల్మాన్ ముద్దులు.. అనంత‌రం మూతి తుడుచుకున్న కండ‌ల వీరుడు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News