HomecinemaNTR : మ‌ళ్లీ బుల్లితెర‌పై ఎన్టీఆర్ సందడి.. ఈ సారి ర‌చ్చ వేరే లెవల్‌లో...

NTR : మ‌ళ్లీ బుల్లితెర‌పై ఎన్టీఆర్ సందడి.. ఈ సారి ర‌చ్చ వేరే లెవల్‌లో…

Telugu Flash News

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటు వెండితెర‌పై అటు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విషయం తెలిసిందే. వెండితెర‌పై స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై కూడా తన మార్క్ చూపించాడు. ఆయన తొలిసారి బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించగా, ఆ షోని పీక్స్ లోకి తీసుకెళ్లాడు. ఆయ‌న వ‌ల్ల‌నే తెలుగులో బిగ్ బాస్ షోకి ఆద‌ర‌ణ పెరిగింది అని చెప్పాలి. ఇక ఈ షో తర్వాత ఎన్టీఆర్ జెమినీ టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేయ‌గా, దీనికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు మ‌రో టీవీ షోతో ప‌ల‌క‌రించ‌నున్నాడ‌నే ప్ర‌చారం న‌డుస్తుంది.

ఏడాది చివరిలో ఎన్టీఆర్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఈ షోపై ఓ క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇక హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో ఈ ఇద్ద‌రు న‌టిస్తుండ‌గా, చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News