Homemoral stories in teluguMoral Stories in Telugu : పులి - ఎలుగుబంటి కథ చదవండి

Moral Stories in Telugu : పులి – ఎలుగుబంటి కథ చదవండి

Telugu Flash News

Moral Stories in Telugu : ఒకసారి ఒక పులి, ఎలుగుబంటికి మధ్య సంవత్సరంలో ఏ నెల చలిగా ఉంటుందన్న విషయంపై వాదన మొదలయింది. “మూర్ఖులు కూడా చెప్పగలరు. చలికాలం అంటే కార్తీకమాసం నుండీ మాఘమాసం వరకు చలి ఎక్కువగా ఉంటుంది” అంది పులి.

“నేనొప్పుకోను. చలికాలంలో నాకు చలిగా ఉండదు. ఎప్పుడయితే వానకు నావంటి మీదున్న బొచ్చు తడుస్తుందో అప్పుడే నాకు ఒణుకు పుడుతుంది” అంటూ పులి మాటలను వ్యతిరేకించింది ఎలుగుబంటి.

నామాట నిజమంటే, నా మాటే నిజమని రెండూ వాదించు కోసాగాయి. ఇంతలో ఒక మనిషి ఆ అడవి మార్గం గుండా పొరుగూరికి వెళుతున్నాడు. అతన్ని చూడగానే పులి “మనుషులు మనకంటే తెలివైనవారనే అభిప్రాయం మనకుంది కదూ ! వెళ్ళి అతన్నే అడుగుదాం” అంది.

రెండూ వెళ్ళి అతని దారికి అడ్డంగా నిలుచున్నాయి. భయపడకు

మిత్రమా నిన్ను చంపడానికి రాలేదు. మా ఇద్దరికీ ఒక విషయంలో వేరు వేరు అభిప్రాయాలున్నాయి. మా సమస్యను నువ్వు పరిష్కరించాలి” అంది ఎలుగుబంటి.

రెండూ ఒకరి తర్వాత ఒకటి తమ వాదనలు వినిపించాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ మనిషి వాటి మాటలు విన్నాడు. తరువాత పులి అతన్ని పక్కకు తీసుకు వెళ్ళి “చూడు, నువ్వు ఇక్కణ్ణుంచి ప్రాణాలతో బయటపడాలంటే నామాటే నిజమని చెప్పాలి” అని హెచ్చరించింది.

-Advertisement-

ఎలుగుబంటి కూడా అతన్ని చాటుకు లాక్కెళ్ళి తన మాటను నెగ్గించమని లేదా ఛస్తావని హెచ్చరించింది.

“మాది ఈ దేశం కాదు. నేను పొరుగుదేశం నుండీ వచ్చాను. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకే నాకు కొంత సమయం కావాలి. చలికాలం, వర్షాకాలం అనుభవించిన తరువాత ఇక్కడకు వచ్చి మీలో ఎవరి మాట నిజమో చెప్తాను” అని భయం పైకి కనిపించకుండా నెమ్మదిగా చెప్పాడు.

“సరే వెళ్ళు. కానీ తప్పకుండా మళ్ళీ రావాలి. కోసం ఎదురు చూస్తుంటాం” అంటూ ఆ రెండు మృగాలు అతనికి దారి వదిలాయి.

“బతుకు జీవుడా!” అనుకుంటూ ఆ మనిషి అక్కడి నుండీ పరుగున వెళ్ళిపోయాడు.

మూర్ఖుల వాదన తీర్చటం కంటే అక్కడి నుండీ వీలైనంత త్వరగా తప్పుకోవడం ఉత్తమం.

నీతి : మూర్ఖునితో వాదం పెట్టుకోరాదు. 

also read news: 

special stories : ఎవరి ఆలోచనలకు అందని సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ(RGV)

Avatar 2 telugu movie review : అవతార్ 2 తెలుగు మూవీ రివ్యూ

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News