HometelanganaMLC Kavitha vs Komatireddy Rajagopal Reddy: లిక్కర్‌ స్కామ్‌లో ట్వీట్‌ వార్‌.. కవిత వర్సెస్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

MLC Kavitha vs Komatireddy Rajagopal Reddy: లిక్కర్‌ స్కామ్‌లో ట్వీట్‌ వార్‌.. కవిత వర్సెస్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Telugu Flash News

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ (Delhi Liquor Scam) లో రాజకీయ పార్టీల నేతలు స్టేట్‌మెంట్లతో వేడి పుట్టిస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ నేతలు లిక్కర్‌ స్కామ్‌పై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) , బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy), తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌(Manickam Tagore .B) మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ కీలక దశకు చేరుకుంది. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. 181 పేజీలతో ఉన్న ఆ ఛార్జ్‌ షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును 28 సార్లు ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాగూర్‌ ట్విట్టర్‌ వేదికగా కవితను ప్రశ్నించారు. లిక్కర్‌ స్కామ్‌లో చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కవిత గారూ.. అంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కవితపై ట్విట్టర్‌లో ఫైర్‌ అయ్యారు. లిక్కర్‌ క్వీన్‌ పేరు ఛార్జ్‌ షీట్‌లో 28 సార్లు ఉందంటూ ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ను జత చేశారు. దీంతో ఈ పోస్టులపై కవిత వెంటనే రెస్పాండ్‌ అయ్యారు. సాధారణంగానే సోషల్‌ మీడియాలో కవిత కాస్త యాక్టివ్‌గా ఉంటారు. రాజగోపాల్‌రెడ్డి ట్వీట్‌కు బదులిస్తూ.. రాజగోపాల్‌ అన్నా.. తొందరపడకు.. మాట జారకు.. 28 సార్లు తన పేరు చెప్పించినా, 28 వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు.. అంటూ కవిత ట్వీట్‌ చేశారు.

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా…

ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాణిక్యం ఠాగూర్‌ ట్వీట్‌పై కూడా కవిత స్పందించారు. తనపై వచ్చిన నిందలు పూర్తిగా అవాస్తవమని కవిత పేర్కొన్నారు. తన నిబద్ధతను కాలమే రుజువు చేస్తుందని మాణిక్యం ఠాగూర్‌కు జవాబిచ్చారు కవిత. ఇది పూర్తిగా బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర అని స్పష్టం చేశారు కవిత. ఈ క్రమంలో మరోసారి బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా కవితపై సెటైర్లు వేశారు. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. నువ్వు లిక్కర్ స్కామ్‌లో ఉన్నది నిజం.. అంటూ ఘాటుగా రిప్లయ్‌ ఇచ్చారు. ఇలా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నేతల మధ్య వార్‌ సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టిస్తోంది.

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News