Homeandhra pradeshChandra Babu at Khammam: ఖమ్మంలో టీడీపీ అధినేత పర్యటన.. మళ్లీ టీడీపీ పుంజుకుంటుందా? చంద్రబాబు వ్యూహమేంటి?

Chandra Babu at Khammam: ఖమ్మంలో టీడీపీ అధినేత పర్యటన.. మళ్లీ టీడీపీ పుంజుకుంటుందా? చంద్రబాబు వ్యూహమేంటి?

Telugu Flash News

తెలుగుదేశం పార్టీ (telugudesam party) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 2019లో అనూహ్యంగా ఏపీ(andhra pradesh) లో అధికారాన్ని కోల్పోయారు. ఏపీలో 2014 లో బీజేపీ (BJP) , జనసేన(Janasena) , టీడీపీ(TDP) కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ అక్కడ వైఎస్‌ జగన్‌ 67 సీట్లు గెలుపొంది గట్టి పోటీ ఇచ్చారు. తర్వాత ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి లాగేసుకోవడం, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. దాని ఫలితమే 2019లో ఆయన 23 సీట్లకు పరిమితమయ్యారని వైసీపీ నేటికీ విమర్శలు చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. అయితే, ప్రస్తుతం టీడీపీ క్యాడర్‌ నిస్సత్తువలో ఉంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి తీవ్ర నిర్వేదంలో ఉన్న టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తనయుడు లోకేష్‌ (Lokesh) వచ్చే నెల నుంచి ఏపీలో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, చంద్రబాబు తాజాగా తెలంగాణపై కూడా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఖమ్మం పర్యటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈరోజు చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించిన చంద్రబాబు.. అనంతరం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చేందుకు దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మళ్లీ పూర్వ వైభవం సాధ్యమా?

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌లోకి చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్‌, కార్యకర్తలు క్యూ కట్టారు. మంత్రులుగా పని చేసిన వారు, ముఖ్య నేతలంతా ప్రస్తుతం కేసీఆర్‌ పక్కన కూర్చున్నారు. వారిని తిరిగి వెనక్కి రప్పించేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నట్లు ఉన్నట్లు సమాచారం. అయితే, తెలంగాణలో ఎప్పుడో ప్రాభవం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ జవసత్వాలు వస్తాయా? అనేది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

also read news:

MLC Kavitha vs Komatireddy Rajagopal Reddy: లిక్కర్‌ స్కామ్‌లో ట్వీట్‌ వార్‌.. కవిత వర్సెస్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

-Advertisement-

actress shraddha das latest hot instagram photos 2022

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News