HometelanganaMLC Kavitha : సుఖేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవు.. ఇదంతా కుట్రేనన్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : సుఖేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవు.. ఇదంతా కుట్రేనన్న ఎమ్మెల్సీ కవిత

Telugu Flash News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తో వాట్సప్ ఛాటింగ్ పేరిట నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నిన్న దర్యాప్తు సంస్థలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆమెపై చర్యలు తీసుకోవాలని దర్యాప్తుసంస్థలను సుఖేష్ కోరాడు. అయితే, దీనిపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై ఇలా దాడులు చేయిస్తున్నారని కవిత ఆరోపించారు.

ఫేక్ ఛాట్ లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, రాజకీయంగా కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను అడ్డుకొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు ఇలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు, యూట్యూబ్ వీడియోలను అడ్డం పెట్టుకొని పని గట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ ఆర్థిక నేరస్తుడు, ఒక అనామక లేఖను విడుదల చేస్తే దానిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం శోచనీయమన్నారు. అటు తర్వాత బీజేపీ ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసి తనపై బురద జల్లే కార్యక్రమం చేశారన్నారు.

ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. అసలు ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయమే లేదని కవిత పేర్కొన్నారు. అతడెవరో తనకు తెలియదన్నారు. వాస్తవాలు పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్నారు. తప్పుడు కథనాలు ప్రసారం చేయడం తగదని హితవు పలికారు.

ఇప్పటి వరకు తన మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాగే దుష్ప్రచారం జరిగిందని, కొందరు తొందరపడి తప్పుడు వార్తలు రాశారని, తర్వాత నిజాలు వెలుగు చూడటంతో తోకలు ముడిచారన్నారు. తాజాగా క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ప్రస్తుతం కొన్ని మీడియాల పరిస్థితి తయారైందన్నారు. ఈ పరిస్థితులు అత్యంత దురదృష్టకరమన్నారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం దారుణమన్నారు. మీడియా సంస్థలు పావులుగా మారిపోయాయని, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకం తెలివైన వారు, విజ్ఞులని కవిత చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు.

also read :

-Advertisement-

Vizag Steel : వైజాగ్ స్టీల్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం.. క్రెడిట్ కోసం నేతల పాకులాట 

Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ..! 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News