తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs Poaching Case) లో సీబీఐకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు సీబీఐ విచారణపై అత్యున్నత ధర్మాసనం స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ చేసే దాకా స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సుందరీశ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతోపాటు ఎలాంటి కాగితాలు, డాక్యుమెంట్లు సీబీఐ అధికారులకు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతం విచారణను ఆపేయాల్సిందిగా స్పష్టంగా చెబుతున్నట్లు పేర్కొంది.
also Read : MLA Rajaiah : రాజయ్య వేధింపుల వ్యవహారంలో ట్విస్ట్.. దంపతులతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తమ వద్ద ఉన్నప్పుడు విచారణ కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లేదంటే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందంటూ హెచ్చరికలు చేసింది ధర్మాసనం. ప్రస్తుతం అత్యున్నత ధర్మాసనానికి వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. జూలై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ చేపడతామని వెల్లడించింది. అప్పటిదాకా యధాతధ స్థితి కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారా? అని తెలంగాణ న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని చెప్పినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.
also read : Tamanna Latest Photos at Lakme Fashion Week 2023
ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యంగా రెండు విషయాలపై విచారణ చేపట్టబోతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కేసు మెరిట్స్, హైకోర్టులోనే అప్పీలుకు వెళ్లడం అనే అంశాలపై వాదనలు వింటామంది. అప్పటిదాకా దర్యాప్తులో స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. అత్యున్నత ధర్మాసనంలో విచారణ కొనసాగుతుండడం, పెండింగ్‌లో ఉండగా కేసు దర్యాప్తు చేయడం అనేది ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని న్యాయమూర్తి జస్టస్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
also read : Pour Moi Survey : భారత మహిళలు.. ప్రపంచంలో అత్యంత అందగత్తెలు!
ఈ కేసు విచారణ విషయానికి వస్తే.. మిస్‌లీనియస్ పిటిషన్లు లేని రోజున చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. మెరిట్స్ ఆధారంగా ఈ అప్పీలు విచారణకు అర్హమా? కాదా? అనేది తేల్చాలని తెలిపింది. ఇందుకోసం చాలా టైమ్ పడుతుందన్న ధర్మాసనం.. ఆ కారణంగానే కేసును జూలైకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు అంశం ఇప్పటి వరకు సీబీఐకి బదిలీ కాలేదని బీజేపీ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర సీఎస్‌కు ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వ తరఫు లాయర్ దుష్యంత్ దవే కోరారు. ఇందుకు సుప్రీం నిరాకరించింది.