భారత రాష్ట్ర సమితి (BRS PARTY) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ (kusuma jagadish) మృతి చెందారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని అజరా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో జగదీష్ ప్రాణాలు కోల్పోయారు.
కుసుమ జగదీష్ అకాల మరణంతో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జగదీష్ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్రను పోషించారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. అతని కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
read more news :
TS IAS అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆరోపణ