Sunday, May 19, 2024
HomehoroscopeHoroscope Today Telugu (21-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (21-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 21st March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సొంత నిర్ణయాలు ఏ మాత్రం మంచి ఫలితాలను ఇవ్వవు. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. . విద్యార్థులకు చాలావరకు సమయం అనుకూలంగానే ఉంటుంది.

Taurus | వృషభ రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. . బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఎంతో ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల సత్ఫలితాలు పొందుతారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది.

Gemini | మిథున రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుండి ఉప‌శ‌మ‌నం పొందుతారు. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా రిలాక్స్‌డ్ గా ఉంటుంది.. బంధు వర్గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవ‌కాశం ఉంది.. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడే అవ‌కాశం ఉంది.

Leo | సింహ రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబ సమస్యను పరిష్కరించుకునే అవ‌కాశం ఉంది.. ఆదాయానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం కూడా ఉంది.. ఆదాయం నిలకడగానే ఉంటుంది.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవ‌కాశం ఉంది.. ఆదాయం తో పాటు అనవసర ఖర్చులు కూడా క్ర‌మంగా పెరిగే ఛాన్స్ ఉంది.

Libra | తులా రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల సహకారంతో ఒక వ్యక్తిగత వ్యవహారం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు కూడా అందుతుంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు.. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలం అయ్యే ఛాన్స్ ఉంది.. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి రావ‌డంతో సంతోష‌ప‌డ‌తారు.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.. అవసరమైన పనులు పూర్తి చేస్తారు.. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధించ‌డంతో ఆనందంగా ఉంటారు.

Capricorn | మకర రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారికి ఆదాయపరంగా శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవ‌కాశం ఉంది.. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు

Aquarius | కుంభ రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు ఉద్యోగ పరంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు చేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. . ఆదాయం నిలకడగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం చెందుతాయి.

Pisces | మీన రాశి ఫలాలు 21-03-2024

ఈ రాశి వారు మిత్రుల సహాయ సహకారాలతో ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవ‌కాశం ఉంది. మంచి కాలం న‌డుస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు చెందుతారు.

also read :

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Mahabharatham story in telugu : మహాభారతం.. పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News