Homehoroscopehoroscope today july 20 2023 | ఈ రోజు రాశి ఫలాలు 20-07-2023

horoscope today july 20 2023 | ఈ రోజు రాశి ఫలాలు 20-07-2023

Telugu Flash News

horoscope today july 20 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Aries horoscope

ఈ రాశి వారికి నేడు అంతా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. కష్టపడితే కాని పనులు పూర్తి కాని పరిస్థితి. శత్రువుల వలన చికాకులు ఏర్పడ‌తాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కొంత కలుగుతాయి. శుభ ఫ‌లితాలు పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Taurus horoscope

ఈ రోజు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయములు చ‌ర్చిస్తారు. దూరప్రాంతపు వాళ్ళతో సంభాషణలు అనుకూలిస్తాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభరాశి వారు ఈరోజున‌వ‌గ్ర‌హ పూజ చేయ‌డం మంచింది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Gemini

ఈ రోజు కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు. ధన సంబంధిత విషయాలలో ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృద‌యాన్ని ప‌ఠించాలి.
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Cancer horoscope

ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొల‌గిపోతాయి.. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయ‌డం మంచిది. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Leo

ఈ రోజు ఈ రాశి వారు అవసరమైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. అలానే అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉంటాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Virgo

ఈ రోజు కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. ఒత్తిళ్లు ఎక్కువ‌గా ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

horoscope today in telugu

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Libra horoscope

ఈ రోజు మీకు . సుఖ భోజన ప్రాప్తి. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము కలుగును. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండ‌డం మంచిది. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Scorpio

ఈ రోజు మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో గడప‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. పిల్లల వలన చికాకులు పెరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Saggitarius

ఈ రోజు మీకు శారీరక శ్రమ కలుగును. ఖర్చులు పెరుగును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Capricorn horoscope

ఈ రోజు ప్రయాణములు అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం వ‌ల‌న కొంత ప్ర‌శాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారముల యందు జాగ్రత్తలు వహించాలి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Aquarius

ఈ రోజు బంధుమిత్రులతో గడుపుతారు. కుటుంబములో చికాకులు ఏర్పడును. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం వ‌ల‌న ఇబ్బందుల‌కి దూరంగా ఉంటారు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 20, 2023 Pisces horoscope

ఈ రోజు శారీరకంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆందోళనలు తగ్గును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.

also read :

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

కాలము, ఋతువులు, శకములు, యుగములు గురించి తెలుసుకోండి

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News