Homedevotionalhoroscope today telugu: 30-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu: 30-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 30th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Aries horoscope

ఈ రాశి వారికి రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికం అవుతుంది.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Taurus

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరుతాయి.. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాల‌ని సాధిస్తారు.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Gemini

ఈ రాశి వారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో ఎక్కువ కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఏర్ప‌డుతంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం వ‌ద్దు.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు త్వ‌ర‌గా పూర్తి చేస్తారు.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Leo

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవ‌కాశం ఉంటుంది.. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్నిపనులు నెర‌వేరవు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Virgo

ఈ రాశి వారు ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను పొందుతారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల అస్స‌లు పనికిరాదు

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Libra horoscope

ఈ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటారు.. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది.. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయ‌రాదు.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Scorpio

ఈ రాశి వారిమంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగ‌లుగుతారు.. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందే ఛాన్స్ ఉంది..

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Saggitarius

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగానే ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం కేటాయించాలి.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Aquarius

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను స్వ‌ల్పంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కొంత కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 30, 2022 Pisces horoscope

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందే ఛాన్స్ ఉంది.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనడం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News