Horoscope Today, 28th january 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు తగిన ప్రతిఫలం చేతికి అందుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి.
వృషభం
ఈ రాశి వారికి మంచి ఉద్యోగం లభించవచ్చు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం కూడా ఉంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం
ఈ రాశి వారికి కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడి బాగా ఉన్నా బాధ్యతలను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది.. మిత్రులకు ఉపయోగపడే పనులు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు
కర్కాటకం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత సమస్యని చాకచక్యంగా పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది.. మీ నుంచి సహాయం పొందిన కొందరు బంధువులు ముఖం చాటేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
సింహం
ఈ రాశి వారికి రాజకీయంగా పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలోనూ, వృత్తి వ్యాపారాల్లోనూ ముందడుగు వేయడానికి ఓ అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఇంట్లోనూ, వెలుపలా పని భారం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
కన్య
ఈ రాశి వారికి సంబంధించి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకోలగలగుతారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడకపోవడం జరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి.
తుల
ఈ రాశి వారికి ఆదాయానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి అస్సలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త లక్ష్యాలు మీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.. ఇంటా బయటా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉండగా, ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం
ఈ రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. అవసరానికి తగినట్టుగా డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాల వారు నిలకడగా రాణిస్తారు.
ధనుస్సు
ఈ రాశి వారు ఆస్తి విలువకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించండి. ప్రమాదాలకు అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
మకరం
ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసే ఛాన్స్ ఉంది. . ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. పిల్లల పురోగి చెందుతారు.
కుంభం
ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు బంధువుల సహాయంతో పరిష్కారం అవుతాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని భారం ఎక్కువవుతుంది. సంపాదనపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
మీనం
ఈ రాశి వారి ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రమోషన్‌కి అవకాశం ఉంది. అధికారులు, సహచరులు ఎంతగానో సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
also read:
karthika deepam: బాబోయ్ కార్తీక దీపం సీక్వెల్ కూడానా…
urfi javed : ఈ బ్యూటీకి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదట..
Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..
Layoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!
KCR Visit to Nanded : నాందేడ్‌లో బీఆర్‌ఎస్ సభకు సర్వం సిద్ధం.. కేసీఆర్ పర్యటన వివరాలివీ..
శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ సాక్షిగా సిద్ధార్థ్-అదితి లవ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?