HomedevotionalHoroscope (18-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (18-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 18th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు ప్రతిదీ ఆలోచించి చేయడం మంచిది. ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే అనుకున్న‌ లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదుయ్యే అవ‌కాశం ఉంది. సహచరుల సహకారం కూడా తీసుకోండి. కోపతాపాలకు ఇది స‌రైన సమయం కాదు. బంధువులతో చిన్న చిన్న అపార్ధాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది.

వృషభం

ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. స్నేహితులు, ఆప్తుల సలహాలను కూడా తీసుకోండి. ఇరుగుపొరుగు వారితో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

మిథునం

ఈ రాశి వారికి స్నేహితుల నుంచి, బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబంలో సాధార‌ణ‌ ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

కర్కాటకం

ఈ రాశి వారు ఉద్యోగంలో కొన్ని విషయాల మీద బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలించే అవ‌కాశం ఉంది.. వ్యాపారంలో కొన్ని ఊహించని ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాల బాగుంటుంది.

సింహం

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంతృప్తి లభిస్తుంది. మీ మాటకు క్ర‌మంగా విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. వివాహ ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి ఆర్థికపరమైన ప్రయత్నాలు ఒక్కోటి ఒక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచన విధానంతో ముందడుగు వేయ‌డం మంచిది. రుణ సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికివచ్చే పనులు ప‌ద్ద‌తిగా చేస్తారు.

తుల

ఈ రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అధికారుల నుంచి మంచి గుర్తింపు లభించే అవ‌కాశం ఉంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేసే స‌మ‌యం ఉంటుంది.

వృశ్చికం

ఈ రాశి వారు ఉద్యోగం విషయంలో అనుకున్నది సాధిస్తారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. దగ్గరి బంధువులతో విభేదాలకు లేదా అపార్థాలకు అవకాశం ఉంది.

ధనుస్సు

ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రులు ఆమెకు అండ‌గా నిలుస్తారు.

మకరం

ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి మంచి సమయం ఇది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి అనుభవానికి వచ్చే అవ‌కాశం ఉంది.. బంధు వర్గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభం

ఈ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది.

మీనం

ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అన్ని విషయాలలోనూ బాగా శ్రమ, ఒత్తిడి అనుభవానికి వస్తుంది.. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. కుటుంబ వాతావరణం చాలావరకు పరవాలేదు. అందరిని కలుపుకుని వెళితే ఉత్త‌మం.

also read :

Viral Video : పనివాళ్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. యజమాని ఏం చేశాడంటే..!

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. మాజీ రిపోర్టర్‌ కిడ్నాప్‌.. ఆపై హత్య!

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌పై కోర్టు ఏమందంటే..

Surekhavani-RGV: వామ్మో.. సురేఖా వాణి ర‌చ్చ పీక్స్ లో ఉందిగా.. నైట్ పార్టీలో ఆర్జీవీతో..!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టేనా.. అమ్మాయి ఎవ‌రంటే..!

gas cylinder : గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఇలా చేయండి..

Sukumar: విరూపాక్ష డైరెక్ట‌ర్ గురించి సుకుమార్ చెప్పిన షాకింగ్ నిజాలు..!

Akhil: ఫ్యామిలీ అన్నాక గొడ‌వ‌లు రావా అంటూ అఖిల్ కామెంట్స్.. ఎందుకిలా అన్నాడు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News