HometelanganaYS Sharmila: షర్మిల పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే.. పాదయాత్రపై మార్గదర్శకాలివే..!

YS Sharmila: షర్మిల పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే.. పాదయాత్రపై మార్గదర్శకాలివే..!

Telugu Flash News

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల (YS Sharmila) తెలంగాణలో ఇటీవల జోరు పెంచారు. వైఎస్సార్‌ టీపీ పేరిట పార్టీ స్థాపించిన ఆమె.. పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలియతిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ విమర్శలపాలవుతున్నారు. మంత్రులు సైతం షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల షర్మిల వాహనశ్రేణిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం షర్మిల.. సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. తర్వాత రోజు డ్యామేజ్‌ అయిన తన వాహనంలో నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకోవడానికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. కారులోంచి కదలకపోవడంతో ఏకంగా క్రేన్‌ సాయంతో షర్మిల ఉండగానే కారును ఎత్తుకెళ్లారు పోలీసులు.

తర్వాత ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల హైకోర్టును ఆశ్రయించింది. తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని, పోలీసుల వైఖరిపై పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలు పెట్టారు షర్మిల. తర్వాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. తన పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టుకు వెళ్లాలని చూసిన ఆమెను.. ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.

చట్ట విరుద్ధంగా వ్యవహరించరాదు..

షర్మిల పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బి.విజన్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. షర్మిల చట్టవిరుద్ధంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసులకు చెప్పకుండా ధర్నాలు, నిరసనలు చేయరాదని షర్మిలకు ధర్మాసనం సూచించింది. షర్మిల ఇంటి వద్ద బారికేడ్లు తొలగించాలని, ఆమె పాదయాత్రకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది ధర్మాసనం. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది పలు అభ్యంతరాలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నా చేస్తే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య వచ్చిందని, అందుకే షర్మిలపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

also read news: 

special stories : ఎనలేని అభిమానం, ఆదరణా పొందిన ఉదయ్ కిరణ్…

-Advertisement-

dandruff : చలికాలంలో చుండ్రు సమస్యలతో సతమతం అవుతున్నారా? పరిష్కార మార్గాలు ఇవే..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News