Thursday, May 9, 2024
Homeandhra pradeshఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి చెలరేగిన దుమారం!

ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి చెలరేగిన దుమారం!

Telugu Flash News

Harish Rao vs Karumuri Nageswara Rao Latest News : తెలంగాణ, ఏపీ మంత్రులు మరోసారి రచ్చకెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ మంత్రులు ఇప్పటికే పలుమార్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీఎస్‌ మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకొని తెలంగాణలో నమోదు చేసుకోవాలని పిలుపునివ్వడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

దీంతో పాటు ఏపీలో మౌలిక సదుపాయాలపై భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. హరీష్‌ రావు మాటలపై ఏపీ మంత్రులు రియాక్షన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మరో మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. హరీష్‌రావు ఏపీకి రావాలని సూచించారు. ఇక్కడి అభివృద్ధిని చూడాలని చెప్పారు.

Renu Desai: స‌ల‌హాలు ఇవ్వ‌డం ఈజీ.. బాధ‌ని అనుభ‌వించే వాళ్ల‌కే తెలుస్తుంది..!

కారుమూరి మాట్లాడుతూ.. మీ దగ్గర ఏముందో చెప్పాలని హరీష్‌రావును ప్రశ్నించారు. చిన్నపాటి వర్షం పడితే జలమయం అయ్యే రోడ్లు, హైదరాబాద్‌ తప్ప ఏ ప్రాంతం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మీ ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకుండా ఏపీపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏం చేశారని ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణను మీరు ఏ రకంగా అభివృద్ధి చేశారో తెలపాలన్నారు.

ఇక టీఆర్ఎస్‌ పార్టీలో టీ తీసేసి బీ చేర్చినంత మాత్రాన అంతా అయిపోతుందా? అంటూ ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పునాదులు పడే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. మరోవైపు విశాఖ ఉక్కు వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ దాఖలు చేస్తామని ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌ ఈ విషయంపై ప్రకటన చేశారు. దీంతో ఏపీలో నేతలు స్పందిస్తున్నారు.

Shakuntalam: రిలీజ్‌కి ముందు శాకుంతలం కి నెగెటివ్ టాక్.. టెన్ష‌న్‌లో చిత్ర బృందం

-Advertisement-

విశాఖ ఉక్కుపై సీఎం జగన్‌ ఇంతకుముందే ప్రకటన చేశారని, ఏ మాత్రం అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని నిర్వహిస్తుందని చెప్పారని గుర్తు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణ కోసం మూలధన సేకరణలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తాజాగా ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ను చూపింది. ప్రైవేట్‌, ఇతర స్టీల్‌ అనుబంధ రంగాల సంస్థలు ఉక్కు పరిశ్రమ ప్లాంటు నిర్వహణకు అవసరమైన మూలధన వ్యయాన్ని అందించి తమ ఉత్పత్తులను తీసుకోవాలని తెలిపింది.

మరోవైపు ఇందులో తెలంగాణ ప్రభుత్వంగానీ, ఏపీ ప్రభుత్వంగానీ, సింగరేణి సంస్థగానీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని ఏపీ నేతలు చెబుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్‌ఎస్‌ ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News