HomecinemaShakuntalam: రిలీజ్‌కి ముందు శాకుంతలం కి నెగెటివ్ టాక్.. టెన్ష‌న్‌లో చిత్ర బృందం

Shakuntalam: రిలీజ్‌కి ముందు శాకుంతలం కి నెగెటివ్ టాక్.. టెన్ష‌న్‌లో చిత్ర బృందం

Telugu Flash News

Shakuntalam: సమంత ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో గ్రాండ్‌గా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.

Samantha Latest Photos Shakuntalam Movie Promotions

ఈ క్ర‌మంలోనే సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ స్క్రీన్ లో 3డీ వెర్షన్ ని ప్రదర్శించారు. అయితే సినిమా చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని, డైరెక్టర్ గుణశేఖర్ స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Latest beautiful Photos from Shaakuntalam movie

స‌మంత డ‌బ్బింగ్ కూడా బాగోలేద‌ని, సినిమా మొత్తం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉందని త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న గుణ‌శేఖ‌ర్‌కి ఈ చిత్రం తీవ్ర‌మైన నిరాశ‌ని క‌లిగించింద‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి 14 వ తేదీన ఇదే రేంజ్ టాక్ వస్తుందా, లేదా సూపర్ హిట్ టాక్ వస్తుందా అనేది చూడాల్సి ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News