Gold Rates Today (25-04-2023) : బంగారం ధర పెరిగినప్పుడు మాత్రం విమానంలా దూసుకెళ్తోంది. తగ్గినప్పుడు మాత్రం నత్తలాగా తగ్గుతోంది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 చొప్పున తగ్గాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650కి చేరింది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,710గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.80,000గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ హైదరాబాద్‌లో ఉన్న ధరే అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,710గా ఉంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,710గానే ఉంది. వాణిజ్య స్థావరమైన ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,710గా ఉంది.
డబ్బున్న వారు ఆసక్తి కనబరిచే విలువైన లోహం ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.620 తగ్గింది. 29,030కి చేరింది. బంగారం, వెండి, ప్లాటినం సహా అన్ని ఆభరణాల ధరలు రోజూ మారుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటుంటాయి.
also read :
Weather Today : తెలంగాణ, ఏపీలో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందంటే.. ఐఎండీ చల్లని కబురు (25-04-2023)
Suma Adda : అదేంటి.. హీరో గోపీచంద్ ఏకంగా సుమ గొంతు పట్టేసుకున్నాడు..!
Horoscope (25-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?