HometelanganaHyderabad : హైదరాబాద్‌లో దారుణం.. మాజీ రిపోర్టర్‌ కిడ్నాప్‌.. ఆపై హత్య!

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. మాజీ రిపోర్టర్‌ కిడ్నాప్‌.. ఆపై హత్య!

Telugu Flash News

హైదరాబాద్‌ (hyderabad) లో దారుణం చోటు చేసుకుంది. ఓ మాజీ విలేకరిని కిడ్నాప్‌ చేసిన దుండగులు.. ఆపై కిరాతకంగా హత్య చేశారు. నగర శివార్లలోని కొత్తూరు పరిధిలో ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. మల్లాపూర్‌ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్‌రెడ్డి (29) గతంలో ఓ దినపత్రికలో పని చేశాడు. కొంత కాలం కిందటే మానేశాడు.

తాజాగా కొత్తూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద డాక్యుమెంట్‌ రైటర్‌గా పని పని చేస్తుండేవాడు. అయితే, ఆదివారం రాత్రి తన ఇంటి వద్ద ఉండే శ్రీధర్‌రెడ్డితో పాటు చేగూరు నుంచి తిమ్మాపూర్‌ వైపు కారులో వెళ్తున్నారు. మధ్యలో తీగాపూర్‌ వద్ద దుండగులు.. వీరిని అటకాయించారు. కారును అడ్డగించి అద్దాలు ధ్వంసం చేశారు.

తర్వాత శ్రీధర్‌రెడ్డిపై దాడికి పాల్పడి.. కరుణాకర్‌రెడ్డిని ఇంకో కారులో బలవంతంగా లాక్కెళ్లారు. ఘటనపై శ్రీధర్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున గచ్చిబౌలి వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు కరుణాకర్‌రెడ్డి డెడ్‌బాడీని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని చూడగా.. మృతదేహం కరుణాకర్‌రెడ్డిదేనని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, హత్యకు గల కారణాలు కనుక్కొనేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కొత్తూరు మండల స్థాయిలో ఓ ప్రజా ప్రతినిధి, రిపోర్టర్‌ కరుణాకర్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సదరు ప్రజా ప్రతినిధి వద్ద అనుచరుడిగా పని చేసిన కరుణాకర్‌రెడ్డి.. వారిమధ్య పొరపచ్చాల కారణంగా అతడికి దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య గొడవలు పెరిగి కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ ప్రజా ప్రతినిధి అనుచరులు, సోదరులే కరుణాకర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి ఆపై హతమార్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

కరుణాకర్‌రెడ్డి బంధువులు ఈ మేరకు కంప్లయింట్‌ చేశారు. కిడ్నాప్‌ ఘటన జరిగినప్పటి నుంచి సదరు ప్రజా ప్రతినిధికి సంబంధించిన సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కిడ్నాప్‌, హత్యలో పాల్గొన్న నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మాజీ రిపోర్టర్‌ కిడ్నాప్‌, హత్య ఘటన నేపథ్యంలో మీడియా సర్కిళ్లలో ఓ రకమైన భయాందోళన ఏర్పడింది.

-Advertisement-

also read :

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌పై కోర్టు ఏమందంటే..

Surekhavani-RGV: వామ్మో.. సురేఖా వాణి ర‌చ్చ పీక్స్ లో ఉందిగా.. నైట్ పార్టీలో ఆర్జీవీతో..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News