Sunday, May 12, 2024
HomeinternationalPakistan : పాకిస్తాన్‌లో చైనా బిజినెస్‌లు మూసివేత.. ఎందుకంటే!

Pakistan : పాకిస్తాన్‌లో చైనా బిజినెస్‌లు మూసివేత.. ఎందుకంటే!

Telugu Flash News

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ (Pakistan) లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్‌లో చైనాకు సంబంధించిన బిజినెస్‌లకు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాక్‌లో చైనా వ్యతిరేకత నానాటికీ పెరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

తాజాగా కరాచీలో చైనీయులు నిర్వహించే వ్యాపార సంస్థల్లో కొన్నింటిని తాత్కాలికంగా మూసివేసేలా చేశారు. ఆయా సంస్థలను ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజుల కిందట ఇస్లామాబాద్‌లోని చైనా దౌత్య కార్యాలయంలో కొంత మేర మూసివేయాలని చైనా నిర్ణయించింది.

దాంతోపాటు పాకిస్తాన్‌లో నివసించే చైనీయులు అప్రమత్తంగా ఉండాలని బీజింగ్‌ అడ్వయిజరీ అధికారులు ప్రకటన జారీ చేయడంతో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చైనాకు సంబంధించిన వ్యాపారాలను మూసివేయించేలా పాకిస్తాన్‌ పావులు కదుపుతోంది. ఉగ్రదాడులకు ముందస్తు ఇంటెలిజెన్స్‌ సమాచారం కూడా ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో చైనీయుల భద్రతకోసం సరైన చర్యలు తీసుకొనే దాకా వ్యాపారాలు మూసివేసేటట్లు నిర్ణయం తీసుకున్నారట. మూసివేయించిన బిజినెస్‌లలో చైనా సూపర్‌ మార్కెట్‌, రెస్టారెంట్లు, సీ ఫుడ్స్‌ కంపెనీ లాంటివి ఉన్నాయి. ఆయా సంస్థలు సింధ్‌ రాష్ట్ర చట్టాల ప్రకారం తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్‌లో ఉండే చైనీయుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా సార్లు బీజింగ్‌ కోరింది. అయితే, పాకిస్తాన్‌ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఇప్పటికే పాకిస్తాన్‌లోని చాలా ఉగ్రవాద సంస్థలు చైనీయులే లక్ష్యంగా దాడులు చేశాయి. తమ దేశాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకుంటోందన్న అనుమానాలు పాక్‌కు బలపడ్డాయి.

ఈ నేపథ్యంలోనే చైనా వ్యతిరేక కార్యకలాపాలను పాకిస్తాన్‌ పెంచింది. అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇది కొత్త తలనొప్పిగా మారింది. తమ దేశంలోని గనులు, వనరులను చైనా ఆక్రమిస్తోందని పాకిస్తాన్‌ జాతీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా కోరినట్లు తమ దేశ వాసులకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసేంత, వారిని పోషించేంత ఆర్థిక స్తోమత పాకిస్తాన్‌ వద్ద ప్రస్తుతం లేదు. దీంతో ఎవరి భద్రత వారే చూసుకోవాలన్నట్లుగా పాక్‌ వ్యవహరిస్తోంది. భవిష్యత్‌లో చైనా, పాక్‌ మధ్య వివాదం, సంక్షోభం మరింత ముదురుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

-Advertisement-

also read:

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కు అంటూ…

Karthikeya: అమ్మ‌కి పెళ్లి కాక‌ముందే రాజ‌మౌళిని నాన్న అని డిసైడ్ అయ్యా: కార్తికేయ‌

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News