Monday, May 13, 2024
HomesportsODI World Cup 2023: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్‌ జరిగే చాన్స్?

ODI World Cup 2023: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్‌ జరిగే చాన్స్?

Telugu Flash News

ODI World Cup 2023 : అంతర్జాతీయ వన్డే వరల్డ్‌ కప్‌ ఈ ఏడాది జరగనుంది. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌కు సంబంధించిన వార్త ఒకటి హల్‌ చల్‌ చేస్తోంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగబోతోందని ఆ వార్తల సారాంశం. భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అహ్మదాబాద్‌ వేదికను ఖరారు చేయబోతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రపంచ కప్‌ 2019లో ఇండియా, పాకిస్తాన్‌ మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా తలపడలేదు. ఇండియా, పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది.

అంతేనా.. భారత్‌లో అత్యంత ఉత్సాహంగా చూసే మ్యాచ్‌లుకూడా ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ మీడియాలో ప్రసారమైన వార్తల ప్రకారం.. భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారట.

నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మంది వీక్షించే అవకాశం ఉంది. అయితే, భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించే అంశంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత జట్టు మేనేజ్‌మెంట్‌తో బీసీసీఐ సంప్రదింపులు జరపనుందని తెలుస్తోంది.

వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. టోర్నమెంట్ చివరి మ్యాచ్ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. దీనికోసం పలు వేదికలను ఖరారు చేశారట. నాగ్‌పూర్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, బెంగళూరు, ధర్మశాల స్టేడియంలను తుది జాబితాలో చేర్చారు.

-Advertisement-

భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన అన్ని మ్యాచ్‌లు చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఆడించే అవకాశాలున్నాయని సమాచారం. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాక్‌ మధ్య చివరి వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 89 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 336 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పాక్‌ 40 ఓవర్లలో 212 పరుగులే చేయగలిగింది. వర్షం అడ్డంకిగా మారడంతో 302 పరుగుల టార్గెట్‌ను విధించారు. ఇండియా తరపున రోహిత్ శర్మ 140 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ ఆడాడు. అప్పట్లో హిట్‌ మ్యాన్‌ సెంచరీలతో మాంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

also read :

NGT: బిహార్‌ ప్రభుత్వంపై ఎన్జీటీ కొరడా.. రూ.4 వేల కోట్ల జరిమానా!

Sharwanand: జ‌న‌వ‌రిలో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న శ‌ర్వా ఇంకా పెళ్లి పీట‌లెక్క‌డంలేదు ఎందుకు..!

 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News