Monday, May 13, 2024
HomesportsAsia Cup 2023 వేదిక మార్పు! పాకిస్తాన్‌కు షాక్‌ తప్పదా?

Asia Cup 2023 వేదిక మార్పు! పాకిస్తాన్‌కు షాక్‌ తప్పదా?

Telugu Flash News

ఆసియా కప్‌ (Asia Cup 2023) విషయంలో పాకిస్తాన్‌కు షాక్‌ తగిలేలా ఉంది. పాకిస్తాన్‌ వేదికగా ఈ ఏడాది ఆసియా కప్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే, పాక్‌లో తాము ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈసారి కూడా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆసియా కప్‌ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ పరిణామం ఇందుకు ఊతం ఇస్తోంది.

శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) సభ్య దేశాల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసియా కప్‌ నిర్వహణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరైన ఏసీసీ చైర్మన్‌ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్‌ సేథీ ఈ అంశంపై చర్చలు జరిపారు. ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు సంబంధించి యూఏఈకి షిప్ట్‌ చేసే అవకాశాలపై మాట్లాడుకున్నారు. అయితే, ఆసియా కప్‌ను ఎక్కడ నిర్వహించాలనేది వచ్చే నెల మార్చిలో వేదిక ఖరారు చేయనున్నారు.

మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ పాకిస్తాన్‌లో జరగాలి. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్‌ వెళ్లాల్సి ఉంటుంది. కానీ భారత, పాకిస్తాన్‌ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన అగాధాల వల్ల పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఆడకపోతే ఆసియా కప్‌ పాకిస్తాన్‌లో నిర్వహించినా పెద్దగా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

భారత్‌తోపాటు అన్ని దేశాల్లో తటస్థ వేదికలపై టోర్నీ నిర్వహిస్తే ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి తగినంత ఆదాయం చేకూరుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో గొప్పలుపోయి వచ్చే డబ్బులు పోగొట్టుకొనే కన్నా.. బీసీసీఐతో సఖ్యతగా మెలిగిన డబ్బులు పొందడం ఉత్తమమైన మార్గమని క్రికెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. పాకిస్తాన్‌ ముందున్న ఏకైక మార్గం యూఏఈ. అక్కడ టోర్నీని నిర్వహించడం వల్ల అన్ని విధాలుగా పాకిస్తాన్‌కు మేలు జరుగుతుందని స్వయంగా పాక్‌ క్రికెట్‌ బోర్డు కూడా యోచిస్తోంది.

also read :

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి బైడెన్‌..

-Advertisement-

పదో తరగతి విద్యార్థి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేశాడు!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News