Homeandhra pradeshAP News: ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్స్‌ కోసేసిన ప్రియురాలు.. వివాహేతర సంబంధం అనుమానంతో ఘాతుకం!

AP News: ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్స్‌ కోసేసిన ప్రియురాలు.. వివాహేతర సంబంధం అనుమానంతో ఘాతుకం!

Telugu Flash News

AP News: యువతీ యువకులు క్షణికావేశంలో చేసే కొన్ని తప్పులు జీవితాంతం కష్టాలు కొనితెచ్చుకొనేలా చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రేమలో మునిగిన జంటలు ప్రపంచాన్ని మర్చిపోయేలా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఏ సమస్యా రాదు. ఒక్కసారి పొరపచ్చాలు ఏర్పడ్డాయంటే ఇక అంతే సంగతులు. ఇద్దరిలో ఎవరు ఆవేశపడినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

ప్రేమ సవ్యంగా సాగుతున్నప్పుడు లోకమంతా రంగుల హరివిల్లులా ప్రేమికులకు కనిపిస్తుంది. ఆనంద డోలికల్లో తేలియాడుతుంటారు. అభిప్రాయ భేదాలు తలెత్తిన సమయంలో ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ప్రేమికులు తమ పార్ట్నర్‌పై అఘాయిత్యానికి పాల్పడుతుంటారు. మరికొందరు ప్రేమికుల కుటుంబ సభ్యులపై కూడా దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇందుకు తాజాగా ఏపీలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. అక్కడ ఓ ప్రియురాలు.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. ఏకంగా అతడిపై బ్లేడ్‌తో అటాక్‌ చేసింది సదరు ప్రియురాలు. మలికిపురం మండలం గూడపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఓ వ్యక్తి రాజోలు మండలం తాటిపాకకు చెందిన మరదలు వరసయ్యే మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండేవారు.

వేరే వారితో వివాహేతర బంధం పెట్టుకుంటావా.. నీ పని చెప్తా..!

అయితే, ఈ నెల 17న తన ఇంట్లో ఎవరూ లేరని.. ఇంటికి వచ్చేయాలంటూ అతడిని మహిళ పిలిచింది. ఈ క్రమంలో నువ్వు వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావ్‌.. నువ్వు నాకే సొంతం.. ఇంకెవరికీ దక్కనివ్వను.. అంటూ గొడవకు దిగింది ఆ మహిళ. వాగ్వాదం జరుగుతుండగా సహనం కోల్పోయిన మహిళ.. బ్లేడుతో అతడిపై అటాక్‌ చేసింది. మర్మాంగాన్ని కోసింది. తీవ్రగాయం కావడంతో బాధితుడిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితుడికి ఇప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

also read news:

Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రియల్ లైఫ్ స్టోరీ .. లెక్క లేనన్ని రికార్డులు అతని సొంతం..

-Advertisement-

Lionel Messi : అర్జెంటీనాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన సూప‌ర్‌హీరో మెస్సీ గురించి తెలుసుకుందామా ? మెస్సీ లైఫ్ స్టోరీ !

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News