Monday, May 13, 2024
HomeSpecial StoriesLionel Messi : అర్జెంటీనాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన సూప‌ర్‌హీరో మెస్సీ గురించి తెలుసుకుందామా ? మెస్సీ లైఫ్ స్టోరీ !

Lionel Messi : అర్జెంటీనాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన సూప‌ర్‌హీరో మెస్సీ గురించి తెలుసుకుందామా ? మెస్సీ లైఫ్ స్టోరీ !

Telugu Flash News

Lionel Messi : ఫుట్‌బాల్‌ చరిత్రలో అద్భుతమైన ఆటను,ప్రతిభను చూపిన వారిలో క్రిస్టియానో రోనాల్డో ఒకరైతే అర్జెంటీనా దిగ్గజం అయిన లియోనల్ మెస్సీ మరొకరు.అలాంటి మంచి వ్యక్తి, గొప్ప ఆటగాడు అయిన మెస్సీ గురించి తెలియాలంటే ఇది చదవాల్సిందే.

  • 1987, జూన్ 24న అర్జెంటినాలోని రోసరియోలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మెస్సీ.
  • చిన్న తనం నుంచే ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెంచుకున్న మెస్సీ బార్సిలోన జట్టులో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
  • తను కోరుకున్న విధంగానే నిత్యం కష్టపడుతూ తన లక్ష్యం వైపు అడుగులు వేసిన మెస్సీ బార్సిలోన జట్టులో చేరాలనే ఉద్దేశంతో 13 ఏళ్ల వయసులో స్పెయిన్ కి మకాం మార్చాడు.
  • తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడు 2004లో తన మొదటి అంతర్జాతీయ గోల్ ను నమోదు చేసాడు.
  • అలా మొదలైన తన ఫుట్‌బాల్‌ ప్రయాణంలో ప్రతి మ్యాచ్ లోనూ అంచెలంచలుగా ఎదుగుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ వచ్చిన మెస్సీ 2011,ఆగస్టులో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్ గా సరికొత్త ఫుట్‌బాల్‌ ప్రయాణం మొదలు పెట్టాడు.
  • తన అద్భుతమైన ఆటతో,మైమరిపించే ప్రతిభతో ఎనలేని అభిమానం పొందిన మెస్సీ ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో 398 మిలియన్ల ఫాలోవర్స్ తో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన 2వ వ్యక్తిగా నిలిచాడు.

ఫుట్‌బాల్‌ రికార్డులు

  • తన ఫుట్‌బాల్‌ జీవితంలో 2021 లో బార్సిలోనా క్లబ్‌ను విడిచిపెట్టేంత వరకూ పది లా లిగా టైటిల్స్, ఏడు కోపా డెల్ రే టైటిల్స్ నాలుగు UEFA ఛాంపియన్స్ లీగ్‌లతో సహా 34 ట్రోఫీలను గెలుచుకున్న మెస్సీ ఒక మంచి ప్రతిభ కలిగిన ఆట గాడిగా లా లిగా (474), లా లిగా యూరోపియన్ లీగ్ సీజన్ (50), లా లిగా (36) UEFA ఛాంపియన్స్ లీగ్ (8) లలో అత్యధిక గోల్స్ చేయడంతో రికార్డులను సాధించి అందరి ఆదరణను పొందాడు.
  • ఆ క్లబ్ లో ఉన్న కాలం మొత్తంలో 750కి పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేసిన మెస్సీ ఒకే క్లబ్ లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
  • స్పోర్ట్స్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండి పోయే మెస్సీ రికార్డు స్థాయిలో ఏడు బాలన్ డి’ఓర్ అవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
  • క్రిస్టియానో రోనాల్డోకి, తనకు జరిగే పోటీ ఆట వరకు మాత్రమేనని బయట వారిద్దరూ మంచి స్నేహితులని చెప్తుంటారు మెస్సీ.
  • అదే విధంగా ఆటకెంత విలువనిస్తాడో తన కుటుంబానికి కూడా అంతే విలువనిచ్చే మెస్సీ కుటుంబం కంటే ఎక్కువ ఏది కాదని చెప్తుంటారు.

2022 ఫిఫా వరల్డ్ కప్ లో 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్‌ అందించి సగర్వంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

తన ఆటతో,తన బలమైన సంకల్పంతో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పేరు పొందిన మెస్సీ లాంటి వ్యక్తి జీవిత ప్రయాణం తెలుసుకోవడం,తెలిసేలా చేయడం ఆటను ఇష్టపడే ప్రతి ఒక్కరి బాధ్యత.

also read news:

Acidity : చలికాలంలో ఎసిడిటీ బాధిస్తోందా? ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

mrunal thakur latest instagram hot photos 2022

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News