Sunday, May 12, 2024
HomeSpecial StoriesCristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రియల్ లైఫ్ స్టోరీ .. లెక్క లేనన్ని రికార్డులు అతని సొంతం..

Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రియల్ లైఫ్ స్టోరీ .. లెక్క లేనన్ని రికార్డులు అతని సొంతం..

Telugu Flash News

క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) ఫుట్‌బాల్ చరిత్రలో కొత్తగా పరిచయం అవసరం లేని వ్యక్తి.
కోట్లల్లో అభిమానులు, వందల్లో అవార్డులు, లెక్క లేనన్ని రికార్డులు ఇవన్నీ రోనాల్డో సొంతం. అలాంటి వ్యక్తి గురించి తెలియని వాళ్ళు లేరనడం అతిశయోక్తి కాదేమో.

1985, ఫిబ్రవరి 5 న పోర్చుగల్ లోని ఫంచల్ లో ఒక పేద కుటుంబంలో జన్మించిన రోనాల్డో 10 ఏళ్ల వయసు నుంచే ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టాడు.అలా అడడం మొదలు పెట్టిన రోనాల్డో ఫుట్‌బాల్ పై ఎంత పిచ్చి ప్రేమను పెంచుకున్నాడంటే ఒకోసారి భోజనాన్ని కూడా లెక్క చేయకుండా గంటలు గంటలు ఆడుతూ ఉండేవాడట.

ఉపాధ్యాయుడితో గొడవపడి 14 ఏళ్లకే చదువు మానేసిన రోనాల్డో అప్పటి నుంచి తన దృష్టినంతా ఫుట్‌బాల్ ఆడటం పైనే పెట్టాడు.పోర్చుగల్ కు వరల్డ్ కప్ ను జయించి తీసుకువస్తానని చెప్తూ అదే లక్ష్యంగా ఎప్పుడూ చేతుల్లో ఫుట్‌బాల్ తోనే కనిపించే వాడని రోనాల్డో తల్లి తండ్రులు చాలా సందర్భాల్లో చెప్పారు.

15 ఏళ్ల వయససులో ఒక చిన్న గుండె సమస్య రావడంతో ఇక తను ఫుట్‌బాల్ అడలేనేమో అని భయపడిన రోనాల్డో ఆ తరువాత సర్జరీ ద్వారా అది నయమవ్వడంతో కోలుకుని మరింత సంకల్పంతో ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టాడని కూడా అన్నారు.

ఇక 17 ఏళ్లకే బ్రెజిల్ జాతీయ జట్టులో 98 మ్యాచులు ఆడిన రోనాల్డో 62 గోల్స్ చేసి జాతీయ జట్టులో ఎక్కువ స్కోర్ ని నమోదు చేసిన 3వ వ్యక్తిగా నిలిచాడు.

18 ఏళ్లకే 2003లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడిగా తన జీవితాన్ని ప్రారంభించిన రోనాల్డో తన మొదటి అంతర్జాతీయ గోల్ ను యురో 2004లో నమోదు చేసుకున్నాడు.

-Advertisement-

అలా తన ఫుట్‌బాల్ జీవితం మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఒక సంచలనంగా మారిన రోనాల్డో తన అధుతమైన ప్రతిభను కనబరుచుతూ 2008లో పోర్చగల్ జట్టుకు కెప్టెన్ గా మారాడు.

రోనాల్డో రికార్డులు

రోనాల్డో తన కెరీర్‌లో 30 ప్రధాన ట్రోఫీలను గెలుచుకోగా వాటిలో ఏడు లీగ్ టైటిల్స్, ఐదు UEFA ఛాంపియన్స్ లీగ్స్, ఒకటి UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ఒకటి UEFA నేషన్స్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి.UEFA ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్(134) మరియు అత్యధిక అసిస్ట్ (41) రికార్డులు సొంతం చేసుకున్న రోనాల్డో,ఒకే క్లబ్, దేశం కోసం 750 కి పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

100 అంతర్జాతీయ గోల్స్ సాధించిన రెండవ ఆటగాడిగా, ఐరోపా దేశాలలో మొదటివాడిగా నిలిచి ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసాడు.ప్రపంచంలోనే అత్యధిక వేతనాన్ని తీసుకుంటున్న ఆటగాడిగా చరిత్రకెక్కి ఆశ్చర్య పరిచాడు.

అదే విధంగా రికార్డు స్థాయిలో 5 బాలన్ డి’ఓర్ అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా నిలిచాడు.ఆటలోనే కాకుండా అభిమానం పొందడంలోను అందరికంటే ఒకడుగు ముందున్న రోనాల్డో ఇన్‌స్టాగ్రామ్( Instagram) లో 518 మిలియన్ల ఫాలోవర్స్ తో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

ఇలా ఎన్నో రికార్డులు,అవార్డులు సొంతం చేసుకున్న రోనాల్డో కి ఏమాత్రం అహంకారం లేకపోవడం,ఆయన మనసులో కుటుంబానికి,తన అభిమానులకు ఒక ప్రత్యేక స్థానం ఉండడం విశేషం.

ఇక రోనాల్డో మెస్సీ గురించి మాట్లాడుతూ మెస్సీ కి,తనకు జరిగే పోటీ ఆట వరకు మాత్రమేనని బయట వారిద్దరూ మంచి స్నేహితులని,తన కొడుకుకి ఆటలో తనకంటే మెస్సీ అంటేనే ఇష్టం అని చెబుతుంటారు.

తన వ్యక్తిత్వం గురించి తన తల్లి మాట్లాడుతూ రోనాల్డో పుట్టే సమయానికి తను డబ్బులు లేక పేద రికంతో ఇబ్బంది పడుతున్నానని,అందువల్లే రోనాల్డో కి జన్మనివ్వడం ఇష్టం లేక తనకు దొరికిన మందులతో గర్భస్రావానికి పాల్పడ్డాడని,కానీ అది పలించకపోవడంతో రోనాల్డో జన్మించాడని చెప్పుకొచ్చారు.

తను వద్దనుకున్న బిడ్డే ఈ రోజు తన కుటుంబం ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండడానికి కారణమయ్యాడని చెప్తుంటారు.

రోనాల్డో తండ్రి తనకు 20 ఏళ్లు ఉన్నపుడే చనిపోయారని,పేద రికంతో బాధ పడిన ఆయన తన కొడుకు విజయాన్ని చూడకుండానే చనిపోయారని చాలా సందర్భాల్లో బాధపడ్డారు.

మంచి కుటుంబం నుంచి మంచి వ్యక్తులే వస్తారని నిరూపించిన రోనాల్డో చారిటీ ద్వారా ఎంతో మందికి సహాయపడుతూ వారి చీకటి బ్రతుకులో వెలుగుల సంతోషాలను నింపాడు.

also read news :

Rashmi Gautam Latest instagram images december 2022

Moral Stories in Telugu : అందమైన దస్తూరి

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News