శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ (Kota Bommali PS) సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించాడు. రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.
మలయాళంలో ‘నాయట్టు’ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమాలో, పోలీసులను పోలీసులే వెంటాడే కథాంశం ఉంది. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో మాత్రం యావరేజ్ గానే నిలిచింది.
ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పోలీసులుగా పనిచేస్తుంటారు. ఒక సంఘటనలో ఈ ముగ్గురినీ డిపార్ట్మెంట్ నిందితులుగా భావిస్తుంది. వారిని పట్టుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది.