Sunday, May 12, 2024
HomecinemaKota Bommali PS : శ్రీకాంత్ హీరోగా నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' ఓటీటీలో

Kota Bommali PS : శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ ఓటీటీలో

Telugu Flash News

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ (Kota Bommali PS) సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించాడు. రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.

మలయాళంలో ‘నాయట్టు’ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమాలో, పోలీసులను పోలీసులే వెంటాడే కథాంశం ఉంది. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో మాత్రం యావరేజ్ గానే నిలిచింది.

ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పోలీసులుగా పనిచేస్తుంటారు. ఒక సంఘటనలో ఈ ముగ్గురినీ డిపార్ట్‌మెంట్ నిందితులుగా భావిస్తుంది. వారిని పట్టుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News