Homeviral newsViral Video : బైక్‌ను నీటిలో కూడా నడుపుతారా.. ఈ వీడియో చూసేయండి..

Viral Video : బైక్‌ను నీటిలో కూడా నడుపుతారా.. ఈ వీడియో చూసేయండి..

Telugu Flash News

Viral Video : భారీ వర్షాలు కురిసే సందర్భాల్లో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహించడం చూస్తుంటాం. ఈ క్రమంలోనే వాగులు, వంకలు, రోడ్లపై ప్రవహించే నీరు ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. అయితే, వీటిని లెక్క చేయక కొందరు వాహనదారులు నీటి ఉధృతిలోనే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు వాహనాలతో పాటు వారు కూడా గల్లంతు అవుతుంటారు.

కొందరు ప్రాణాలతో బతికిపోతుంటారు. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఇలాంటి ఘటనలు ఉండవు. అయితే, తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్‌ అయ్యింది. నదిలో ఓ యువకుడు బైక్‌ నడిపిన తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రోడ్లపై ద్విచక్రవాహనాలు నడుపుతుంటారు. నీటిలో నడిచే బైక్‌లు కూడా ప్రస్తుతం అక్కడక్కడ అందుబాటులో ఉన్నాయి.

అయితే, రోడ్డుపై నడిచే పల్సర్‌ వాహనాన్ని ఓ యువకుడు చిత్రంగా నదిలో నడిపి వావ్‌ అనిపించేలా చేశాడు. బైక్‌ను నదిలో నడుపుకుంటూ అవతలి తీరాన్ని చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. నదిలో కాస్త నీరు తక్కువ ఉధృతితో ప్రవహిస్తుండడంతో యువకుడు సేఫ్‌గా అవతలికి చేరుకున్నాడు. బైక్‌ మునిగేంత నీరు లేకపోవడం ఇక్కడ ప్లస్‌ పాయింట్‌ అయ్యింది.

Viral Video: క్లబ్‌ ఎదుట యువతి రచ్చ రచ్చ.. డ్రెస్‌ తీసేసి ఏం చేసిందో చూడండి!

సుమారు రెండు నుంచి మూడు అడుగుల నీరు మాత్రమే ఉండడంతో యువకుడు సులువుగా డ్రైవ్‌ చేసుకుంటూ ఒడ్డుకు చేరిపోయాడు. నదిలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ కింది భాగంలో ఇసుక ఉంటుంది. దీంతో బైక్‌ నడపడం, దాన్ని కంట్రోల్‌ చేసుకుంటూ వెళ్లడం చాలా కష్టమైన పని. బైక్‌ నడపడంలో మంచి ఎక్స్‌పర్ట్‌ అయితేనే ఇలాంటివి సాధ్యమవుతాయి.

యువకుడు నడిపిన తీరుపై నెటిజన్లు ఓవైపు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచడంతో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. మోటార్‌ ఆక్టేన్‌ అనే ఆటో మొబైల్‌ బ్లాగ్‌, యూట్యూబ్‌ ఛానల్‌ ఈ వీడియోను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. దీంతో లక్షలాది మంది వీక్షించారు. సంకల్పం ఉంటే మార్గం దొరుకుతుందని ట్విట్టర్‌లో ఈ వీడియోకు జతచేశారు.

-Advertisement-

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

ఇది వెరీ క్లవర్‌ పనా? లేదా రిస్క్‌తో కూడుకున్నదా? అని క్యాప్షన్‌ పెట్టారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఐదు లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇది నిజంగా రిస్కేనంటూ దీనిపై ఓ నెటిజన్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. నీరు ఇంజిన్‌లోకి వెళ్తే పరిస్థితి ఏంటని మరో యూజర్‌ ప్రశ్నించాడు. ప్రమాదాన్ని అంచనా వేసి తదనుగుణంగా బైక్‌ను నడిపాడంటూ కొందరు మెచ్చుకున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News