HomedevotionalHoroscope (09-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (09-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 9th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనే ప‌రిస్థితి ఉంటుంది.. చాలాకాలంగా బాధ పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.

వృషభం

ఈ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించే అవ‌కాశం ఉంది.

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

మిథునం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకునే ఛాన్స్ ఉంది.ఇక‌ ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం

ఈ రాశి వారు కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది.. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే ఉత్త‌మం.. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువల నుంచి సహాయ సహకారాలు అందుకునే ఛాన్స్ ఉంది.

-Advertisement-

సింహం

ఈ రాశికి చెందిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. తోబుట్టులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.

horoscope today teluguకన్య

ఈ రాశి వారు ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండ‌డం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండ‌డం మంచిది. ఆర్థిక లావాదేవీలు అస్స‌లు పెట్టుకోవద్దు.

తుల

ఈ రాశికి చెందిన వారికి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందే ఛాన్స్ ఉంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతాయి.

భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..

వృశ్చికం

ఈ రాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవ‌డం ఉత్త‌మం. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం చేయాలి.. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా సమస్యలున్నా, ముందుకు దూసుకుపోతారు

ధనుస్సు

ఈ రాశికి చెందిన వారు దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి రావ‌డంతో సంతోషంగా ఉంటారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభించే అవ‌కాశం ఉంది.

మకరం

ఈ రాశికి చెందిన వారు స్నేహితులను గానీ, బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడే ఛాన్స్ ఉంది.వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఎక్కువ‌.

కుంభం

ఈ రాశికి చెందిన వారు ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు క్ర‌మంగా తగ్గుముఖం పడతాయి. ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయం అవుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ పురోగతి సాధించే అవ‌కాశం ఉంది.

మీనం

ఈ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేసే ఛాన్స్ ఉంది. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవ‌కాశం ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News