Sunday, May 19, 2024
Homeviral newsViral Video: క్లబ్‌ ఎదుట యువతి రచ్చ రచ్చ.. డ్రెస్‌ తీసేసి ఏం చేసిందో చూడండి!

Viral Video: క్లబ్‌ ఎదుట యువతి రచ్చ రచ్చ.. డ్రెస్‌ తీసేసి ఏం చేసిందో చూడండి!

Telugu Flash News

Viral Video : ఇటీవలి కాలంలో పెద్దింటి యువతీ యువకులు కల్చర్‌ను మార్చేస్తున్నారు. ముఖ్యంగా తాగుడుకు అలవాటు పడిన యువత పెడదోవ పడుతున్నారు. క్లబ్బులు, పబ్బుల వద్ద హల్‌ చల్‌ చేస్తూ నానా యాగీ చేయడం పరిపాటిగా మారిపోయింది. పీకల దాకా మద్యం సేవించి ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు.

Viral Video : పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలు.. లేపి మరీ తన్నించుకున్న యువకుడు

పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? తామెలా ప్రవర్తిస్తున్నామనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓ యువతి అర్ధరాత్రి పూట డ్రెస్‌ తీసేసి హల్‌ చల్‌ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సదరు యువతి క్లబ్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది.

దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు ఆమెను అడ్డుకున్నారు. సమయం అయిపోయిందని, వెళ్లిపోవాలని సూచించారు. దీంతో యువతి తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమైంది. భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటికొచ్చిన బూతులు తిట్టసాగింది. తనను లోపలికి అనుమతించాల్సిందేనని పట్టుబట్టింది.

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

ఇలాగే ప్రవర్తిస్తే తాను డ్రెస్‌ విప్పేస్తానని భద్రతా సిబ్బందిని బెదిరించసాగింది. చివరకు అనుకున్నట్లే ప్రవర్తించి డ్రెస్‌ను విప్పేసింది. వారితో మరింత పెద్దగా ఘర్షణకు దిగింది. అయితే, ఈ తతంగాన్నంతా సెక్యూరిటీ సిబ్బంది సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. దీంతో యువతి మరింత రెచ్చిపోయింది. తన అనుమతి లేకుండా వీడియో ఎందుకు తీస్తున్నారంటూ ఫైర్‌ అయ్యింది. వారి ఫోన్‌ లాక్కునేందుకు ట్రై చేసింది.

-Advertisement-

అయితే, యువతి వీరంగాన్ని, ఆమె చేష్టలపై సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొనే లోపే యువతి కారులో ఉడాయించింది. ఇక జరిగిన ఘటనపై క్లబ్‌ ఓనర్‌ కరణ్‌ ఠక్కర్‌ నాగ్‌పూర్‌లోని సోనేగావ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

అతిగా మద్యం సేవించడం వల్లే యువతి ఇలా ప్రవర్తించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక యువతి చేసిన రచ్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News