HomecinemaIndraja: ఇంద్ర‌జ‌కి కోపం తెప్పించిన వెంకీ.. సీటు నుండి లేచి సీరియ‌స్‌గా వెళ్లిపోయిన ఇంద్ర‌జ‌

Indraja: ఇంద్ర‌జ‌కి కోపం తెప్పించిన వెంకీ.. సీటు నుండి లేచి సీరియ‌స్‌గా వెళ్లిపోయిన ఇంద్ర‌జ‌

Telugu Flash News

Indraja: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్ ప్రేక్ష‌కుల‌కి ఎంత వినోదం పంచుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో చంటి, యాదమ్మ, నూకరాజుల స్క్రిప్ట్ లు న‌వ్వులు పూయించ‌గా వెంకీ, తాగుబోతు రమేష్‌ల స్కిట్ కూడా బాగుంది.

అయితే స్కిట్ పూర్త‌య్యాక మాకు ఎందుకు ప‌ది మార్కులు ఇవ్వ‌లేదో తెలుసుకోవచ్చా అని వెంకీ .. జడ్జ్ ఇంద్రజని ప్రశ్నించారు. బాగా చేసిన‌ప్పుడు ఇచ్చాం. ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువగా చేశారు కాబట్టి ఇవ్వలేదంటూ ఇంద్ర‌జ‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Jabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

మేం వంద శాతం బాగానే చేశామని అనుకుంటున్నామని వెంకీ చెప్పగా, ఆ విష‌యం కృష్ణభగవాన్‌ని కూడా అడగండి, ఆయన కూడా 9 మార్కులే ఇచ్చారుగా అంటూ ఇంద్రజ రిప్లై ఇస్తూ.. ఇలా ఎందుకు మాట్లాడ‌తారో అని ఏకంగా సీట్‌ నుంచి లేచివెళ్లిపోవడంతో షో మొత్తం హీటెక్కిపోయింది.

ఒక్క మార్క్ కోసం వెంకీ.. ఇంద్రజతో వాగ్వాదానికి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అస‌లు విష‌యం తెలియాలంటే పూర్తి షో ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News