HomecinemaRashmika: ర‌ష్మిక.. రిషబ్ శెట్టి నెంబ‌ర్‌ని బ్లాక్ చేసిందా.. అస‌లేం జ‌రిగింది ?

Rashmika: ర‌ష్మిక.. రిషబ్ శెట్టి నెంబ‌ర్‌ని బ్లాక్ చేసిందా.. అస‌లేం జ‌రిగింది ?

Telugu Flash News

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల‌లోను దుమ్ము రేపుతుంది. అయితే కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక‌..ఆ మూవీ ఆఫర్ తనకు ఎలా వచ్చిందో చెప్పి అంద‌రిని ఆశ్చర్యపరిచింది.

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

ఓ కొత్త నంబర్ నుండి తనకు ఫోన్ కాల్ రాగా, మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంటున్నాము అని అన్నార‌ట‌. అంతేకాకుండా… మీతో మాట్లాడాలని కూడా వారు చెప్పారట. దాంతో ఎవరో ఆటపట్టిస్తున్నారని భావించిన రష్మిక నాకు ఇంట్రెస్ట్ లేదని ఫోన్ పెట్టేసిందట. అలాగే ఆ ఫోన్ నంబర్ కూడా బ్లాక్ లో పెట్టేసిందట.

rishab shetty

అప్పుడు తన టీచర్ ద్వారా ఆ చిత్ర దర్శకుడు తనను సంప్రదించారట. అప్పుడు నమ్మకం కుదిరి త‌న‌కు నటన రాదని రష్మిక చెప్పారట. అప్పుడు ఆ ద‌ర్శ‌కుడు కొన్ని డైలాగ్స్ చెప్పి తనతో పలికించి రికార్డ్ చేసుకున్నాడట. అనంత‌రం రష్మీకి ఆఫర్ ఇచ్చాడట. ఆ విధంగా కిరిక్ పార్టీ మూవీతో రష్మిక మందాన హీరోయిన్ కాగా, ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారింది. మ‌రి ఇంత‌కు ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News