Homeviral newsViral video : దానికదే స్టార్ట్‌ అయిన ట్రాక్టర్‌.. దెయ్యం తోలిందా? వీడియో వైరల్‌!

Viral video : దానికదే స్టార్ట్‌ అయిన ట్రాక్టర్‌.. దెయ్యం తోలిందా? వీడియో వైరల్‌!

Telugu Flash News

Viral video : ఉత్తరప్రదేశ్‌లోని ఓ షోరూమ్‌లో ట్రాక్టర్‌ దానంతట అదే స్టార్ట్‌ అయిపోయింది. ఏకంగా షోరూమ్‌ అద్దాలను ధ్వంసం చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక చోట ఆగి ఉన్న ట్రాక్టర్‌.. ఉన్నట్టుండి ముందుకు కదలడం మొదలు పెట్టింది.

దీంతో పాటు ఎదురుగా ఉన్న సైకిళ్లను తొక్కేసింది. ముందు భాగంలో ఉన్న షోరూమ్‌ అద్దాలను పగులగొట్టింది. అక్కడే ఉన్న వారికి అసలు ఏం జరుగుతోందో కాసేపు అర్థం కాలేదు. సినిమాను తలపించేలా ఉన్న ఈ సీన్ యూపీలో దర్శనమిచ్చింది.

యూపీలోని బిజ్నోర్‌లో ఓ షోరూమ్‌ ఎదుట ట్రాక్టర్‌ను ఉంచారు. అయితే, సడెన్‌గా దానంతట అదే కదిలింది. అంతేనా.. ఎదురుగా వచ్చిన సైకిళ్లను తొక్కేసుకుంటూ వెళ్లింది. ఇంకాస్త ఎదురుగాఉన్న స్టోర్‌ అద్దాలను, ఇతర సామాగ్రిని పగలగొట్టేసింది. షోరూమ్‌కు సంబంధించిన రెండు అద్దాలు పగిలిపోయాయి. అయితే, ట్రాక్టర్‌ సీట్లో డ్రైవర్‌ లేరు. దానంతట అదే కదలాడటంతో మొదట అక్కడున్న వారు భయపడ్డారు.

డ్రైవర్‌ నడపకుండానే ఎలా కదిలిందబ్బా.. అని ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలు ఎదురుగా ఉన్న స్టోర్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇందులో ట్రాక్టర్‌ ఎలా స్టార్ట్‌అయ్యిందో స్పష్టంగా కనిపించింది. దీంతో జరిగిన నష్టంపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఉదంతం సమాధాన్‌ దివస్‌ను నిర్వహిస్తున్న బిజ్నోర్‌ కొత్వాల్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట జరిగింది. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొందరు ట్రాక్టర్‌పై పోలీస్‌ స్టేషన్‌ సమీపానికి చేరుకున్నారు.

కిషన్‌ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను చెప్పుల షాప్‌ వద్ద ఆపాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ట్రాక్టర్‌ ఇలా కదిలింది. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

-Advertisement-

నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ట్రాక్టర్‌పైకి దెయ్యం ఎక్కి తోలిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన ట్రాక్టర్‌ అంటూ మరికొందరు కామెంట్‌ పెడుతున్నారు.

also read :

Naveen Murder Case : ట్రయాంగిల్‌ ప్రేమ కథలో సంచలన విషయాలు.. యువతి ఫోన్లో కీలక అంశాలు!

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స‌మంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!

Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023

Sreemukhi: లక్కీ శ్రీముఖి.. సీనియ‌ర్ స్టార్స్ చిత్రాల‌లో క్రేజీ రోల్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News