Baby in Brazil news : సాధారణంగా శిశువులు జన్మించిన సమయంలో మూడున్నర కిలోల వరకు బరువు ఉంటారని వైద్యులు చెబుతారు. పిండం ఎదుగుదలలో సమస్య ఉన్న కేసుల్లో అయితే కేజీ కన్నా తక్కువ వెయిట్ ఉన్న శిశువులు కూడా జన్మిస్తుంటారు. మూడు కేజీల బరువును నార్మల్ వెయిట్‌గా చెబుతారు వైద్యులు. రేర్ కేసుల్లో మాత్రమే భారీ బరువుతో శిశువులు జన్మిస్తుంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉదంతం బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.
బ్రెజిల్‌లోని యాంగర్సన్ శాంటోన్ అనే మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయతే, ఈ బిడ్డ అసాధారణ రీతిలో అధిక బరువు కలిగి ఉన్నాడని వెల్లడించారు. సుమారు 8 కేజీల వెయిట్, రెండు అడుగుల పొడవున్న బాలుడికి ఆ మహిళ జన్మనిచ్చింది.
అయితే జననం సందర్భంగా శిశువు హెల్త్ కండీషన్ స్టేబుల్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక బరువు గల నవజాత శిశువు రికార్డు ఇటలీలో నమోదైంది.
1955లో 10.2 కేజీల శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చింది. తాజాగా బ్రెజిల్ మహిళకు 7.328 కేజీల బరువున్న శిశువు జన్మించడంతో వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన ఘటనల్లో మాత్రమే జెయిట్ బేబీల జననాలు నమోదవుతాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. నాలుగు కిలోలు, అంతకన్నా ఎక్కువ బరువుతో పిల్లలు పుడితే మాక్రోసోమియా అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచ జనాభాలో ఇలాంటి ఘటనలు 12 శాతం నమోదవుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గర్భం సందర్భంగా మహిళలకు మధుమేహం వ్యాధి సోకితే 15 నుంచి 45 శాతం వరకు శిశువులు బరువు పెరిగి జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు.
ఇక మహిళల్లో 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా 20 శాతం వరకు మాక్రోసోమియా సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరోవైపు తండ్రి వయసు 35 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మాక్రోసోమియా వచ్చే ప్రమాదం 10 శాతం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
also read :
China spy balloon : అమెరికాలో చైనా నిఘా బెలూన్.. కూల్చివేయబోయి ఆగిపోయిన యూఎస్ ఇంటెలిజెన్స్!
మృణాల్ ఠాకూర్ ఫోటోలు.. ఇంతందం దారి మళ్లిందా..