Sunday, May 12, 2024
HomesportsMS Dhoni Police Officer Look : పోలీస్‌ అవతారం ఎత్తిన మహేంద్రసింగ్ ధోని..

MS Dhoni Police Officer Look : పోలీస్‌ అవతారం ఎత్తిన మహేంద్రసింగ్ ధోని..

Telugu Flash News

MS Dhoni Police Officer Look : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్కే కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పోలీస్‌ లుక్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోలీస్‌ యూనిఫాంలో ధోని లుక్‌ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంఎస్‌ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. సారధిగా ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ధోని.. త్వరలో జరగబోయే ఐపీఎల్‌ టోర్నీ కోసం ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేశాడు.

మైదానంలో చమటోడ్చుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు ధోని. భారీ షాట్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న వీడియోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు ఎంఎస్‌ ధోని సినిమా రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించాడు మహేంద్రుడు.

లెట్స్‌ గెట్‌ మ్యారేజ్‌ అనే తొలి తమిళ చిత్రాన్ని కూడా ఈ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నదియా, హరీష్‌ కల్యాణ్, ఇవానా ప్రధాన పాత్రలు పోసిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు నిర్మాతగా ధోని సతీమణి సాక్షి సింగ్‌ వ్యవహరించడం గమనార్హం.

ఎంఎస్‌ ధోని రీసెంట్‌గా పోలీస్‌ గెటప్‌లో ఉన్న లుక్‌ ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ప్రకటన షూటింగ్‌లో భాగంగా ధోని ఈ గెటప్‌ ధరించినట్లు తెలుస్తోంది.

-Advertisement-

రియల్‌ లైఫ్‌లో క్రికెటర్‌తోపాటు ఆర్మీ లెఫ్ట్‌నెం్‌ కల్నల్‌కూడా అయిన ధోని.. తరచూ బోర్డర్‌కు వెళ్లి సైనికులతో సమావేశాలు కూడా నిర్వహించడం తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు ఆర్మీ యూనిఫాం ధరించి కనిపించిన ధోని.. ఇప్పుడు యాడ్‌ షూటింగ్‌ కోసం పోలీస్‌ దుస్తులు ధరించాడు.

పోయినేడాది ఎంఎస్ ధోని సీఎస్కే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అనంతరం రవీంద్ర జడేజా ఆ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే, అనంతరం వరుసగా వైఫల్యాలను మూటగట్టుకుంది సీఎస్కే. దీంతో తన వల్ల కాదు బాబోయ్‌.. అంటూ రవీంద్ర జడేజా తిరిగి ధోనికే బాధ్యతలు ఇచ్చేశాడు.

దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో సీఎస్కే జట్టు ధోని సారధ్యంలో బరిలోకి దిగనుంది. ధోని నాయకత్వంలో టీమిండియా 28 ఏళ్ల కలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌, ఆసియా కప్‌ కూడా ధోని కెప్టెన్సీలో భారత్‌కు లభించాయి.

also read :

Air India : వెయ్యి అడుగుల ఎత్తులో విమానం.. ఇంజిన్‌లో మంటలు.. 184 మంది ప్రయాణికులను పైలట్‌ ఏం చేశాడంటే!

China spy balloon : అమెరికాలో చైనా నిఘా బెలూన్‌.. కూల్చివేయబోయి ఆగిపోయిన యూఎస్‌ ఇంటెలిజెన్స్‌!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News