Sunday, May 12, 2024
HomeSpecial Storiesspecial stories : శాంటా క్లాస్ గా మారి చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్న ఆ ఇద్దరు..

special stories : శాంటా క్లాస్ గా మారి చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్న ఆ ఇద్దరు..

Telugu Flash News

special stories : క్రిస్మస్ కు శాంటా వచ్చి బహుమతులు ఇస్తాడని చాలా మంది పిల్లలు నమ్ముతుంటారు. కానీ అది ఒక చిన్న నమ్మాలనిపించే అబద్ధం అని అందరికీ తెలుసు. ఇలాంటి అందమైన అబద్ధం నిజం చేసి చాలా మంది పిల్లల మొహాలలో ఆనందపు వెలుగులు నింపారు.

జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ లు అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన మాన్‌హట్టన్ లో ఒక అపార్టుమెంట్ లోకి కొత్తగా దిగారు. వాళ్ళు ఆలా దిగిన మరుసటి రోజు నుంచే 22 వ వీధిలో ఉన్న వారి అపార్టుమెంట్ కి  సాంటా మాకు బహుమతులు కావాలంటూ కొంత మంది పిల్లల నుంచి వచ్చిన ఉత్తరాలను గమనించారు.

ఎవరో సరదాకి చేసుంటారులే అని భావించి వాళ్ళు వాటిని అంతగా పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన వీరికి తెలియని విషయం ఏంటంటే ఇలా సాంటా మాకు బహుమతులు కావాలి అనే ఉత్తరాలు చాలా కాలం నుంచే ఆ అపార్టుమెంట్ కి వస్తున్నాయట.

కానీ ఇంతకు ముందు ఉన్న వారెవరు వాటిని పట్టించుకోలేదు. ఆ అపార్టుమెంటులోకి అద్దెకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. పోయేవాళ్లు పోతూనే ఉన్నారు. కానీ ఆ అడ్రస్ కి వచ్చే ఉత్తరాలు మాత్రం ఆగలేదు.

ఇప్పుడు కొత్తగా దిగిన జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ కు కూడా ఈ ఉత్తరాలు రావడం ఆగలేదు. ఆలా విరామం లేకుండా వస్తున్న ఉత్తరాలను చూసి చూసి జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ల ఓపిక నశించినా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. సరే అని ఆ ఉత్తరాలను వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కన పెడుతూ వచ్చారు.

స్నేహితులకు క్రిస్మస్ పార్టీ

2010 లో జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ లు క్రిస్మస్ సందర్భంగా వారి బంధువులకు, స్నేహితులకు ‘1960 థీమ్ పార్టీ ‘  ఒక క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి వచ్చిన వారంతా జిమ్ గ్లాబ్ ఇంట్లో కుప్పలుకుప్పలుగా పడి ఉన్న ఉత్తరాలను చూసి అవి ఏంటి అని ఆశ్చర్యంగా ఆరా తీయగా తమకు రోజూ వస్తున్న ఆ సాంటా ఉత్తరాల గురించి చెప్పకొచ్చాడు గ్లాబ్.

-Advertisement-

అప్పుడే అక్కడున్నవారిలో ఒకరు ఆ ఉత్తరాలలో ఒక ఉత్తరంలో ఉన్న కోరిక తను తీరుస్తానని చెప్పి ఒక ఉత్తరం తీసుకున్నారు.అక్కడున్న వారు కూడా అదే తరహాలో ఉత్తరాలలో ఉన్న కోరికలు తీరుస్తామని చెప్పి ఎవరికి వారు ఒక్కో ఉత్తరం తీసుకోవడం మొదలు పెట్టారు.

ముక్కూ మొహం తెలియని చిన్న పిల్లల కోరికలను మనకెందుకులే అనుకోకుండా వాటిని తీర్చడానికి ముందుకు వచ్చిన వారిని చూసిన జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ లు అప్పట్నుంచి తామే సాంటాలుగా మారి వాళ్ళు కోరుకున్న బహుమతులు ఇచ్చి పిల్లలను సంతోష పెట్టడం ప్రారంభించారు.

స్వచ్ఛంద సంస్థ

ఆ తరువాత అందరికీ దీని గురించి తెలియాలని బావించి Miracle on 22nd Street అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి ఎవరికైనా క్రిస్మస్ కి బహుమతులు కావాలంటే తమకు ఉత్తరాలు రాయమని ప్రచారం చేశారు.

miracleon22ndstreet.com అనే ఒక వెబ్ సైట్ మరియు ఫేస్ బుక్ పేజీ ని క్రియేట్ చేశారు.

దానికి పలితం చిన్న పిల్లలందరూ తమకు కావాల్సిన బహుమతుల గురించి ఈ వెబ్ సైట్ కి శాంటా కు ఉత్తరం రాస్తునట్టు రాసి పంపడం ప్రారంభించారు. దీని ద్వారా శాంటా తాము కోరుకున్న బహుమతినిస్తాడు అన్న ఒక అబద్ధం పిల్లల గుండెల్లో నిజంగా మారింది.వాళ్ళ వంతు చిన్న సహాయం అనుకున్న విషయం ఈ రోజు ఎంతో మంది చిన్న పిల్లలో ఆనందాన్ని నింపుతుంది.

ఈ విషయంపై జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్ లు  మాట్లాడుతూ గత ఏడాదితో దాదాపుగా 800 వందల కుటుంబాలకి బహుమతులు పంపి ఆనందాలు నింపామని చెప్పారు. కొంత మంది శాంటా కు బహుమతులు అందించినందుకు సంతోషిస్తూ తిరిగి రాసే ఉత్తరాలు కూడా తమకు ఎంతో ఆనందం కలిగిస్తాయని అన్నారు.

కానీ ఒక సమయంలో ఒక చిన్నపిల్లాడు రాసిన ఉత్తరం చాలా బాధను కలిగించిందని చెప్పారు. ఆ పిల్లవాడి తమ్ముడు చిన్నప్పటినుంచే నడవలేడని తన తమ్ముడిని కూడా తనలా అందరితో పరిగెడుతూ ఆడుకునేలా చేయమని కోరాడని ఆ పిల్లవాడి బాధను వెబ్ సైట్ లో  పంచుకున్నారు.

కొన్ని కోరికలు తీర్చాలనుకున్నా తీరనివని బాధ పడుతూ పోస్ట్ చేశారు. ఏదేమైనా స్వార్థం లేకుండా, ఎటువంటి లాభం ఆశించకుండా చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్న జిమ్ గ్లాబ్, డైలాన్ పార్కర్  ఎంతో గ్రేట్ కదా…

also read news:

Anchor & Actress Anasuya Latest Photos Collection December 2022

Jagan vs Pawan Kalyan : ఏపీలో జగన్‌ వర్సెస్‌ పవన్‌.. ఆర్మీ రంగుపై మళ్లీ రాజకీయ వేడి!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News