Monday, May 13, 2024
HomeSpecial StoriesKhajuraho Temples : శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో గురించి తెలుసుకోండి

Khajuraho Temples : శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో గురించి తెలుసుకోండి

Telugu Flash News

Khajuraho Temples : ఖజురాహో దేవాలయ సముదాయంలోకి పాశ్చాత్య సం దర్శకులు అడుగుపెట్టబోయే ముందు తమ పాశ్చాత్య నైతిక విలువల్ని, సభ్యతా సంస్కృతుల్ని మర్చిపోగలిగితేనే హిందూ యిజమ్ అనే ఒక నిండైన, సంపూర్ణమైన జీవన విధాన భావన హల్లో లోని లోతులను, పరిపూర్ణతను, విజ్ఞతను, ఔన్నత్యాన్ని స్పృశించగలుగుతారు. క్రీస్తుశకం 1839వ సంవత్సరంలో టి.ఎస్. బట్ అనే ఒక బ్రిటిష్ అధికారి అపురూపమైన శిల్పాలతో అలంకరించ బడిన ఖజురాహో దేవాలయ సముదాయాన్ని కనుగొనటం జరిగింది.

భారతదేశంలోని ఎంతో అందమైన దేవాలయాల సముదాయాన్ని తాను కనుగొన్నానని మొదట ఎంతో ఉల్లాసంగా ప్రకటించుకొన్న టి.ఎస్.బట్ తర్వాత తమ విక్టోరియన్ నైతిక విలువలను, తమ సంస్కృతిలోని అసంపూర్ణతను వీటికి కొల బద్దలుగా అన్వయింపచేసి, ఖజురాహోలోని శిల్పాన్ని, శిల్పభంగి మలను వాటిలో నిహితంగా ఉన్న ప్రణయ భావనని, శారీరక మానసిక సాన్నిహిత్యాన్ని అర్థంచేసుకోలేక ఆ భావనని అందుకొనే మానసిక ఆధ్యాత్మిక జైవిక పరిపక్వత లేక వాటిని అసభ్యమైన శిల్పాలని, ఆ శిల్పాల భంగిమలు మనుషుల్లో కామోద్రేకాన్ని రెచ్చగొట్టి, వారి శీల సంపదని లుప్తం చేసే నైతికంగా పతనం చేసే అతి శారీరక వాంఛలకు ప్రతీకలని హిందూమతానికి అల్పత్వాన్ని ఆపాదింపచేశాడు.

అతనితో పాటుగా చాలామంది పాశ్చాత్యులు, విదేశీయులు, భారతదేశానికే చెందిన ప్రకాండ పండితులు, సాహిత్య కారులు వీటిని బూతు బొమ్మలని, హిందూ యిజమ్ అంటే రసికత, శారీరక వాంఛల విచ్చల విడితనం అని ఘోషించారు. ఖజురాహో శిల్పాలలో, శిల్ప భంగిమలలో చిత్రకారులు, శిల్పకారులు, వాటి నిర్మాణానికి మూలకారకులైన మహారాజులు – దాంపత్యాన్ని, దాంపత్యంలో సంలీనమై ఉండే రమణీయ రతిభావనను ప్రోదిచేశారు. ఖజురాహో దేవాలయాలు క్రీస్తుశకం 950-1150 సంవత్సరాల మధ్యకాలంలోని ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలికి సొగసైన తార్కాణాలుగా నిలుస్తాయి.

ఈ సముదాయంలో పెద్దవి చిన్నవి అన్నీ కలిపి 85 దేవాల యాలు నిర్మించబడ్డాయి. ఈ రోజు 25 దేవాలయాలు మాత్రం నిలిచివున్నాయి. మిగిలినవి ధ్వంసం చేయబడ్డాయి లేదా నిర్లక్ష్యానికి గురై శిధిలమయిపోయాయి. ఇక్కడ ప్రతి దేవాలయం మానవ శరీరాన్ని స్ఫురింపచేస్తూ ఆ రూపులో నిర్మించబడ్డాయి. పునాది మానవశరీరంలోని కాళ్ళను ప్రతిబింబిస్తుంది. శిఖరాలు అని పిలువబడే చిన్న సంఖ్యా కారణాలు తూర్పు పశ్చిమంగా అమరిక చేయబడ్డాయి. తక్కువ ఎత్తుతో మొదలయి చివర్లో ఎక్కువ ఎత్తుని అందుకున్న ఈ శిఖరాలు మానవ శిరస్సును సూచిస్తాయి.

-Advertisement-

అమృతంతో నిండిన కలశం గల ఒక గుండ్రనిశిల ప్రతి శిఖరం మీద ఏర్పాటుచేయబడింది. ప్రధాన శిఖరం గర్భా లయం మీద తీర్చి దిద్దబడింది. ప్రతి దేవాలయం గర్భ గుడిలో, ఆ దేవాలయం ఏ దేవుడికి అంకితం చేయబడిందో ఆ దేవుడి    విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ దేవాలయాల్లో హిందూ సంస్కృ తిలోని, హిందూమతానికి మూలమైన త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకిత మీయబడ్డాయి. మిగిలిన దేవాలయాలు త్రిమూర్తుల అవతారా లకు, వారి మిగిలిన ప్రతిరూపాలకు అంకితమీయబడ్డాయి.

ఈ దేవాలయాలు నిర్మితిలో శిల్పకారుల సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కి కొత్త శిఖరాల్ని అధిరోహించింది. ఖజురా హోలో ఇంకో ప్రాచీన భారతీయమతమైన జైనమతానికి సంబంధించిన దేవుళ్ళకు, తీర్థంకరులకు అంకితమిస్తూ నిర్మించబడిన దేవాల యాలు కూడా ఉన్నాయి. రతిభంగిమలకు చెందిన స్పష్టమైన చిత్రణము బ్రిటిష్ సంప్రదాయ వాదాన్ని పుణికి పుచ్చుకున్న టి.ఎస్.బటన్ను చలింప చేశాయి. కాని నిజానికి ఛండేల మహా రాజులు ఎన్నుకొన్న శిల్పకారులు పొంగుతుండే జీవితానికి ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యానాన్ని రూపుదిద్దారు, సృజనాత్మకతకు పరాకా ష్టకు దర్శింపచేశారు.

వారు రూపుదిద్దిన ప్రత్యేక మైన శిల్పాలలో వ్యాఖ్యాన విస్తృతి, విషయాసక్తితో కూడి, పవిత్రమైనది; అపవిత్ర ప్రపంచాలకు నైరూప్యము, శాశ్వత విషయాన్ని మనోవికారంగా చూపిన తీవ్రత కనిపిస్తుంది. హిందూతో ఏ మాత్రం పరిచయం లేని పౌరాణిక గాథల టి.యస్. బట్ పొరపాటుపడటం సహజ మనుకొన్నా భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లోనే కొంత మందికి ఈ దేవాలయ సముదాయ నిర్మాణానికి మూలభూతమైన భావన ఎందుకు అవగాహన కాలేదు అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

హిందూమత విశ్వాసాల ప్రకారం సంభోగ కళ ఆడ, మగ అనే రెండు విభిన్న శరీరాల కలయిక ఏ మాత్రం కాదు. సృష్టిలో సమభాగాన్ని పొందిన ప్రకృతి, పురుషుడు అనే రెండు అర్థభాగాల సంయోగం. ఈ సంయోగం, కలయిక జరిగి నప్పుడే పూర్ణత్వం గోచరించేది రూపుదిద్దుకొనేది. దైహిక కలయిక అనేది ఈ విశ్వంలోనే అత్యంత శక్తిశాలు రైన దేవతలు చేపట్టిన సృష్టి కార్యక్రమాన్ని సూచిస్తుంది. ఈ అనేక రకాలైన వానిని ఒకటిగా కలసిపోయేటట్లు విశ్వంలో ఐక్యత చేయటం తెలుపుతుంది.

ఈ సముదాయంలో ఆడ, మగ శిల్పాల పట్ల శిల్పకారులు చూపించిన సమాన సమభావనను దృఢంగా సూచిస్తున్నది. ఇక్కడి శిల్పాల్లో చిత్రింపచేయబడిన సంభోగన కృత్యాలోని సొగసుని, వివిధ దైహికఐక్యత లేక ప్రేమక్రీడ స్వయం సంసిద్ధతకు అలౌకికమైన గరిమతో కలుగచేసిన (సృజించిన) భావన. కాబట్టి అసభ్యతకు ఏ మాత్రం తావివ్వదు.

హిందూ ప్రపంచంలోనే అత్యద్భుత, శిల్పకళా నిర్మాణము, కళాత్మక సాధనలో ఒకటిగా పేరుపొందిన ఈ ఖజురాహో దేవా లయ సముదాయాన్ని ఛండేల రాజులు ఎందుకు నిర్మింప చేశార నేది ఎవరికీ పూర్తిగా అర్థంకాని ప్రశ్నగానే భావించవచ్చు. ఇది హిందూప్రపంచంలో నీచ వికృత స్థాయి నుంచి అంతు చిక్కని  దైవికతలో ఒక పద్ధతి అని అర్థం చేసుకోవాల్సిన స్థాయికి తీసుకు రాబడింది.

ఖజురాహోలో అతిపెద్ద దేవాలయం ‘కాందరియా’ మహా దేవ దేవాలయం. శివుడికి అంకితమీయబడిన ఈ దేవాలయంలో ప్రధాన వృత్తశిల దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. కైమూర్ ఇసుకరాయిలో చెక్కబడిన 800 పైగా బొమ్మలు ఈ దేవాలయం గోడలకు, నల్ల శాణపు శిలగల పుష్పాలంకరణలు పై కప్పుకు శోభనిస్తుంటాయి. ఈ దేవాలయం ప్రధాన ముఖ ద్వారం ఒకే ఒక ఇసుకశిలలో చెక్కబడి నాలుగు తోరణాలను కలిగి ఉంటుంది. ఈ నాలుగు తోరణాలను ఊహా మొసళ్ళు మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఖజురాహోలోని అన్ని దేవాల యాల్లో ఈ శృంగార శిల్పాలు దేవాలయం బయటి గోడల మీద బయటివైపు కనిపిస్తాయి కాని లోపలి వైపున ఉండవు. అంతరాలయంలో కాని, ప్రధాన ద్వారం దగ్గర బయట స్థలం మీద కాని అసలు కనిపించవు. నిజం చెప్పాలంటే ఖజురాహో లోని శిల్పచిత్రాలు అన్నింటిలో 10% మాత్రమే శృంగార శిల్పాల వర్గంలోకి వస్తాయి.

also read :

Samantha: స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మార‌తారు.. నేనంతే: స‌మంత‌

moral stories in telugu : ఇద్దరు ఇల్లాళ్ళు.. కథ చదవండి

balagam mogilaiah : విష‌మంగా బ‌ల‌గం మొగిల‌య్య ఆరోగ్య ప‌రిస్థితి.. హైద్రాబాద్ ఆసుప‌త్రిలో చేరిక‌

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News