Weather Today: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వచ్చే మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తరాది జిల్లాల్లో సుమారు 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడిన వారు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు.
హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు వేడి గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని, వేడి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు.
Read Also : horoscope | రాశి ఫలాలు 16-05-2023