HomecinemaAnasuya: అన‌సూయ బ‌ర్త్ డే సెల‌బ్రేషన్స్... డీప్ నెక్ బ్లౌజ్‌తో చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుందిగా..!

Anasuya: అన‌సూయ బ‌ర్త్ డే సెల‌బ్రేషన్స్… డీప్ నెక్ బ్లౌజ్‌తో చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుందిగా..!

Telugu Flash News

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌కి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. యాంక‌ర్‌గా న‌టిగా దూసుకుపోతుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ లేపుతూ ఉంటుంది. ఇక వివాదాల‌తోను హెడ్ లైన్స్ లోను నిలుస్తూ ఉంటుంది. కొద్ది రోజులుగా అన‌సూయ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌తో ఫైట్ చేస్తూ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం వరుస చిత్రాలతోనూ నటిగా దూసుకుపోతూ బిజీగా ఉంది. అలానే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో, విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. అయితే రీసెంట్‌గా అన‌సూయ 38వ ప‌డిలోకి అడుగుపెట్టింది. 1985 మే 15న పుట్టిన అన‌సూయ‌ 2008లోనే ఎంబీఏలో పట్టా పొందింది. ఆ తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేసి, అనంత‌రం పలు చానెళ్లలో యాంకర్ గా వర్క్ చేసింది. ఇక 2013లో ‘జబర్దస్త్’ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కావ‌డంతో ఆమె ఫేట్ తిరిగింది.

గ‌త పదేళ్లుగా తెలుగు ఆడియెన్స్ ను బుల్లితెర ద్వారా అల‌రిస్తూ వ‌చ్చిన అన‌సూయ ఇప్పుడు వెండితెర‌పై ర‌చ్చ చేస్తుంది. ఇక అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా త‌న సొష‌ల్ మీడియాలో కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతోనూ పంచుకుంది. కుటుంబ సభ్యులు, తన పిల్లలు, భర్తతో దిగిన పిక్స్ ను షేర్ చేస్తూ.. ‘ఇంకో సంవత్సరం తెలివిగా.. మరో సంవత్సరం ధైర్యంగా’ ఉండబోతున్నట్టు పేర్కొంది అందాల బొమ్మ అన‌సూయ‌. అలానే బర్త్ డే విషెస్ తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ‌జేసింది.. నన్ను ప్రేమించే, నాకు మద్దతునిచ్చే అతి తక్కువ శక్తివంతమైన వారికి థ్యాంక్స్’ అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది.

ఇక బ‌ర్త్ డే రోజు అన‌సూయ అందాల జ‌తార చేసింది. చీరకట్టు, డీప్ నెక్ బ్లౌజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల‌ని రెచ్చ‌గొట్టింది. భర్త నుంచి ముద్దులు తీసుకుంటూ.. ఫ్యాన్స్ కు ఫ్లైయింగ్ కిస్సులను వ‌దులుతూ అమ్మ‌డు చేసిన ర‌చ్చ మాములుగా లేదు. మాములుగానే అన‌సూయ ర‌చ్చ‌కి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక బ‌ర్త్ డే రోజు అందాలు ఆర‌బోస్తే అది మ‌రింత స్పెష‌ల్ అవుతుంది. ఇక అనసూయ రీసెంట్ గా ‘రంగమార్తాండ’తో ప‌ల‌కరించి అల‌రించింది. ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’, ‘విమానం’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అందాల అన‌సూయ‌.విమానం సినిమాలో సినిమాలో అనసూయ గ్రామీణ యువతిగా కనిపించనుంది .. ఆమె పాత్ర పేరు సుమతి కాగా, ఇటీవల‌ అనసూయకి సంబంధించిన గ్లింప్స్ ను .. పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆమె చాలా సెక్సీగా కనిపించి అంచ‌నాలు పెంచింది. లుక్ చూస్తే ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండనుందని అర్ధ‌మైంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News