Monday, May 20, 2024
HomecinemaJhansi: నన్ను చాలా మంది మోసం చేశారంటూ యాంక‌ర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

Jhansi: నన్ను చాలా మంది మోసం చేశారంటూ యాంక‌ర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

Telugu Flash News

Jhansi: ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా ఝాన్సీ బుల్లితెర‌ని ఏలింది. న‌టిగా కూడా మంచి పాత్ర‌లు పోషించింది. ఆమె పర్శనల్ లైఫ్ గురించి మీడియాలో కథనాలు వ‌స్తున్న నేప‌థ్యంలో.. పాపులర్ యూట్యూబ్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చి అనేక విష‌యాలు చెప్పింది. నాతో పని చేస్తే నేనేంటో తెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేసేవారు ఇక నన్ను చాలామంది మోసం చేశారు. అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను ఏనాడు చేయ‌లేదు అని ఝాన్సీ పేర్కొంది.

ఇక నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు కోకొల్ల‌లు. 24 ఎపిసోడ్స్ చేసిన నన్ను, 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ కి దూరంగా ఉంచుతారు. 99 ఎపిసోడ్స్ చేసిన డాన్స్ షోకి 100 ఎపిసోడ్ కి నేను యాంకర్ ను కాదు అని అంటారు. కారణం ఏంటో తెలియదు అని చెప్పుకొచ్చింది ఝాన్సీ. జోగి బ్రదర్స్ లో ఒకరిని ఆమె వివాహం ఆడిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కార‌ణా వ‌ల‌న విడాకులు తీసుకుంది. అప్ప‌టి నుండి పెళ్లి చేసుకోకుండానే కన్న కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ సాగిస్తూ వ‌చ్చింది ఝాన్సీ. ఇక‌ అదే సమయంలో ఆమె ఇద్దరిని దత్తత తీసుకొని చదివించి ప్రయోజకులను కూడా చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News