Thursday, May 9, 2024
Homeviral newsViral Video : పాములు సంభోగంలో ఉండగా డిస్టర్బ్‌ చేసిన డేరింగ్‌ గర్ల్‌..!

Viral Video : పాములు సంభోగంలో ఉండగా డిస్టర్బ్‌ చేసిన డేరింగ్‌ గర్ల్‌..!

Telugu Flash News

Viral Video : సాధారణంగా పాములంటే చాలా మంది భయపడుతుంటారు. పాము అటువైపు వెళ్లిందంటే చాలు.. జడుసుకుంటూ ఉంటారు. కొందరైతే బల్లులు, బొద్దింకలను చూసి కూడా బెదిరిపోతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటివి చూసి చాలా హడలెత్తిపోతుంటారు. పాములు పట్టే వారు సెపరేట్‌గా ఉంటారు. ఏ ప్రాంతంలో పాములున్నా అక్కడికి వెళ్లి పట్టేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓ వీడియోలో ఓ యువతి చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే.

పారిపోతున్న రెండు పాములను ఓ యువతి వెంటాడి మరీ పట్టుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పాములను ఒట్టి చేతులతో పట్టుకొని అవి పారిపోవడానికి యత్నించినా సరే.. కింద మీదా పడి వాటితో ఆ యువతి ఆటాడేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. వీడియోలో ఆ యువతి ధైర్యాన్ని చూసిన నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అవి పాములనుకున్నావా.. నూడుల్స్‌ అనుకున్నావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పాముల్ని చూస్తేనే జనం పారిపోతుంటారు. అవేమీ చేయకున్నా సరే.. వాటిని చూస్తే చంపేసే వారు కూడా చాలా మంది ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీడియోలో ఓ ప్రభుత్వ కార్యాలయం వద్ద చెత్తా చెదారం ఉంది. అక్కడ ఓ చిన్న వంతెన కూడా ఉంది. అయితే, అదే ప్రాంతంలో రెండు పెద్ద పాములు ఒకదానికొకటి పెనవేసుకొని కనిపించాయి. అదే సమయంలో అక్కడికి టీషర్ట్‌, జీన్స్‌ ప్యాంట్‌ వేసుకున్న అమ్మాయి వచ్చింది. పాములను చూసి ఒక్క ఉదుటున వాటిపైకి దూకేసినంత పని చేసింది.

దీంతో పాములు రెండూ పారిపోయేందుకు ప్రయత్నించాయి. అయితే, ఆ యువతి వదలకుండా పట్టేసుకుంది. బ్రిడ్జి కిందకు చేతులు పెట్టి పాములను బయటకు లాగేసింది. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న వారు వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ యువతీ నీ ధైర్యానికి సెల్యూట్‌ అంటున్నారు. రెండు పాములు సంభోగంలో ఉండగా వాటిని అలా డిస్టర్బ్‌ చేస్తావా.. అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలాంటి పనులు చేయాలంటే కాస్త రిస్క్‌ చేయాల్సిందేనంటూ కొందరు కామెంట్లలో పేర్కొంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dekh Bhai (@_dekhbhai_)

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News