Wednesday, May 8, 2024
Homeviral newsViral Video : చదువు కోసం ప్రాణాలకు తెగించి.. విద్యార్థినుల సాహసం!

Viral Video : చదువు కోసం ప్రాణాలకు తెగించి.. విద్యార్థినుల సాహసం!

Telugu Flash News

Viral Video : చిన్ననాటి నుంచి చదువు సంధ్యలు సక్రమంగా అనేది కొందరికి చాలా కష్టతరమైన అంశం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో తిండికి, బట్టకు, గూడుకు ఇబ్బందులు తప్పడం లేదు. దాంతోపాటు తమ పిల్లలకు చదువు చెప్పించలేని వారు కూడా ఉన్నారు.

అయితే, ఓ పూట తిండి తక్కువైనా పర్వాలేదు. తమ పిల్లలను చదివించుకొనే వారు కూడా ఉన్నారు. చదువుకోవడంలో భాగంగా సరైన రోడ్డు సైకర్యం లేక ఇబ్బంది పడే విద్యార్థులు దేశంలో చాలా మందే ఉన్నారు.

తాజాగా వైరల్‌ అయిన వీడియోలో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న బాలికలు కనిపిస్తారు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇలాంటి పరిస్థితులు మారడం లేదు. ఓవైపు నింగిలోకి రాకెట్లను పంపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నేటికీ వెనుకబాటు తనం కనిపిస్తూనే ఉంది.

కనీస వసతులు లేని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు కూడా సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లు లేని గ్రామాల్లో నరకప్రాయంగా పరిస్థితి కొనసాగుతోంది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ కాస్త బాధ కలగక తప్పదు. ఆ వీడియోలో కొందరు అమ్మాయిలు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్కూలుకు వెళ్తున్నారు. ఓ విద్యార్థిని వాగును దాటేందుకు ప్రయత్నిస్తోంది.

వాగు ఇటు ఒడ్డు నుంచి అటు ఒడ్డుకు ఒక తాడు కట్టారు. ఆ తాడుకు వేలాడుతూ ఆ బాలిక నది దాటడం వీడియోలో చూడొచ్చు. వాగును దాటే సమయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. వాగులో నీటి ప్రవాహం కూడా చాలా వేగంగా కొనసాగింది.

-Advertisement-

ఇలా వాగు దాటుతున్న క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటున చెయ్యి జారిపోయి ఎవరైనా నీటిలో పడితే క్షణంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదువు కోసం తన ప్రాణాలను పణంగా పెడుతున్న విద్యార్థినుల దుస్థితి చాలా మందిని కదిలిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని కామెంట్లు పెడుతున్నారు.

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News