Viral Video Today : ప్రస్తుతం చలి కాలం నేపథ్యంలో చాలా మంది గ్రామాలు, పట్టణాల్లోనూ చలిమంట వేసుకుంటూ ఉంటారు. గ్రామాల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. నగరాల్లోనూ ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. చలి కాచుకొనే సందర్భాల్లో కొందరు ఆకతాయి చేష్టలు చేస్తుంటారు. నిప్పు, మంటతో ఆటలాడుతుంటారు. చేతులు, కాళ్లతో ఫీట్లు చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు.
తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో ఓ యువకుడు ఇలాంటి చేష్టలే చేశాడు. సోసల్ మీడియాలో క్రేజ్ కోసమో లేదా స్నేహితుల ముందు తన చేష్టలను చూపించుకోవడానికో అగ్నితో ఆటలాడాడు. చలి మంట జోరుగా వస్తున్న తరుణంలో కాళ్లు, చేతులతో వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టాడు. అయితే, ఒక్కసారిగా అతడి షర్ట్‌కు మంట అంటుకుంది. అనంతరం ప్యాంటుకు కూడా మంటలు విస్తరించాయి.
ఈ క్రమంలో యువకుడికి ఒక్కసారిగా ప్రాణభయం వెంటాడింది. ఇక మంటల్లో కాలిపోతాననే భయంతో వెంటనే షర్ట్ విప్పి విసిరేశాడు. దీంతో సగం ప్రమాదం తప్పింది. అయితే. ఇంకా ప్యాంటుకు మంటలు మండుతూనే ఉన్నాయి. కాసేప పరుగెత్తి ట్రై చేశాడు.. అయినా ఆరిపోలేదు. ఇక కింద పడి నేలకు రుద్దాడు. కానీ మంటలు ఆరిపోలేదు. ఇక లాభం లేదని పరుగులంకించుకున్నాడు. దగ్గర్లోనే కాలువ ఉండటంతో అందులో పడి.. మంటలు ఆర్పుకున్నాడు.
తర్వాత కాసేపటికి తేరుకొని బయటకు వచ్చాడు. అనంతరం హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో ఆ యువకుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాన్నంతా పక్కనే ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఇది వైరల్‌గా మారిపోయింది. మంటలతో ఆటలా.. తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే నిప్పుతో చెలగాటం ఆడరాదు అని పెద్దలు చెబుతుంటారని మరికొందరు పోస్టు చేస్తున్నారు.
La danza del fuego pic.twitter.com/43jLTWSkKp
— Profesor Caos (@ProfesorCaos5) January 10, 2023
also read:
Janasena in Rayalaseema : సీమలో జనసేన బలం పెరిగిందా? కర్నూలులో అపూర్వ స్పందనే ఇందుకు సంకేతమా?
పై చదువుల కోసం అమెరికా వెళ్లే వారిలో హైదరాబాదీ స్టూడెంట్లదే హవా.. ఎంత మంది వెళ్తున్నారంటే..!
Rashmi Gautam: ఆపు నీ వేషాలు అంటూ రష్మీపై ఫ్యాన్స్ ఆగ్రహం.. అంత తప్పు ఏం చేసింది..!