Thursday, May 9, 2024
Homeviral newsViral Video : చిరుతకు చెంప చెళ్లుమనిపించిన ఉడుము.. తోకతో దెబ్బ ఇలా ఉంటుందా?

Viral Video : చిరుతకు చెంప చెళ్లుమనిపించిన ఉడుము.. తోకతో దెబ్బ ఇలా ఉంటుందా?

Telugu Flash News

Viral Video : సోషల్‌ మీడియాలో రోజూ అనేక రకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని హృదయాన్ని హత్తుకొనేలా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ వచ్చింది. మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్లు చాలా రకాల కంపెనీలు తీసుకొస్తున్నాయి. దీంతో సమాజంలో ఏ చిన్న ప్రత్యేక ఘటన జరిగినా సరే.. ఫోన్లలో రికార్డు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పెడుతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా జంగిల్ సవారీ లాంటి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వీడియోలను నెట్టింట పోస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

ఆసక్తికరమైన వీడియోలు అప్పటికప్పుడే వైరల్‌గా మారిపోతుంటాయి. కాస్త భిన్నమైన వీడియోలు ఉంటే చాలు నెటిజన్లు ఆదరిస్తున్నారు. వైరల్‌ వీడియోల్లో జంతువులకు సంబంధించినవైతే మరీ ఆసక్తిగా తిలకిస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఓ చిరుతపులి, ఉడుము మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ. దీన్ని నెటిజన్లు విపరీతంగా వైరల్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌ అయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో రైడ్‌కు వెళ్తాడు. జంగిల్‌ సవారీలో భాగంగా ఓ వ్యక్తి అడవిలో అలా షికారుకెళ్లాడు. అందే సమయంలో ఓ చిరుత కనిపించింది. అంతకుముందుగానే అక్కడే ఓ ఉడుము జాతికి చెందిన ప్రాణి రోడ్డుపై వెళ్తూ కనిపించింది. అయితే, అటు వెళ్తున్న ఉడముపై అటాక్‌ చేయడానికి చిరుత ప్రయత్నిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఉడుము ఇచ్చిన ట్విస్ట్‌కు చిరుతకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది.

చిరుత రాకను ముందే పసిగట్టిన ఉడము.. అలర్ట్‌ అవుతుంది. తనను వెంబడిస్తూ వచ్చిన చిరుతకు తోకతో బుద్ధి చెప్పింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా చిరుత ఆ ఉడుమును పుసుక్కున తినేద్దామని ప్లాన్‌ చేసింది. అయితే, ఉడుము ఆ చాన్స్‌ చిరుతకు ఇవ్వలేదు. దగ్గరికి వచ్చిన చిరుతను తన పొడవాటి తోకతో చిరుత చెంప చెళ్లుమనేలా లాగిపెట్టి ఒక్కటి ఇచ్చింది. అంతే.. ఈ దెబ్బకు చిరుతకు ఏం చేయాలో పాలు పోలేదు. ఈ దృశ్యాన్నంతటిని ఆ ట్రావెలర్‌ రికార్డు చేశాడు. దీనికి గ్రాఫిక్‌లో సౌండ్‌ను మిక్స్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలాడు. అంతే దీన్ని నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు.

also read :

-Advertisement-

Times Now Survey : ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీ క్లీన్‌ స్వీప్.. సంచలనంగా మారిన టైమ్స్‌ నౌ సర్వే

Etala Vs Revanth : కాంగ్రెస్‌కు రూ.25 కోట్ల డబ్బు అందిందన్న ఈటల.. ప్రమాణానికి సిద్ధమన్న రేవంత్‌

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News