Sunday, May 12, 2024
HomedevotionalVaralakshmi Vratam : వరలక్ష్మీ వ్రత కథ చదవండి, వినండి, చేయండి

Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రత కథ చదవండి, వినండి, చేయండి

Telugu Flash News

Varalakshmi Vratam : శ్రీ వరలక్ష్మీ వ్రత కథ

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పు చున్నాడు. మునులారా ! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది.

పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనము పై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆనందసమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాథా ఆ మహత్తర ! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది.

అందుకా త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినవాడై దేవీ ! నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది, అది వరలక్ష్మీ వ్రతం, దాని విధివిధానం వివరిస్తాను విను. శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలెనను.

దేవా ! ఈ వరలక్ష్మీ వ్రతమునకు ఆదిదేవతగా ఎవర్ని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియ జెప్పమని పార్వతి అడిగెను.

కాత్యాయనీ ! ఈ వరలక్ష్మీ వ్రతమును వివరముగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటుండేది. ఆ పట్టణము బంగారుకుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.

-Advertisement-

ఆమె మిక్కిలి సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాలగృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్క రించెను.

“ఓ చారుమతి ! నీ యందు అనుగ్రహము కలిగిన దానను, ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను.

చారుమతి అత్యంత ఆనందమును పొంది “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావనీ ! నా పూర్వజన్మసుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది.” అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించెను.

చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించినవారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకొనవలసినదని చెప్పిరి.

ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణశుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణశుక్రవారం రోజున చారుమతి, గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానంచేసి పట్టువస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు.

బియ్యం పోసి పంచ పల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే’ వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో ‘సర్వమంగళమాంగళ్యే శివే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. (సాధ్యమైనవారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్టించుకొనవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు ఘల్లు, ఘల్లున మ్రోగినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయమానమైనవి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణభూషితలయ్యారు.

చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీలయొక్క గృహములు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయినవి. ఆయా స్త్రీల ఇళ్ళనుండి గజతురగ రధ వాహనములు వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్ళినవి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరిసింపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందిరి.
మునులారా! మహర్షులారా ! మముక్షువులారా ! శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను.

ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యై శ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతమహర్షి తెలిపాడు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News