Friday, May 10, 2024
Homeandhra pradeshTirumala: ఏడాదిలోపు చిన్నారితో తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోండి..

Tirumala: ఏడాదిలోపు చిన్నారితో తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోండి..

Telugu Flash News

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది తరలి వెళ్తుంటారు. అయితే, ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు, వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు చాలా సమయం వేచి ఉండలేరు.

వీరి ఇబ్బందులను గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. దర్శనానికి ప్రాధాన్యం కల్పించింది. ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఫ్రీగా, అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించింది.

ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన పని లేదు. నేరుగా దర్శానానికి పంపిస్తారు. దర్శనం కోసం కొన్ని నియమ, నిబంధలు ఉన్నాయి.

ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు పిల్లలకు చెందిన ఒరిజినల్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. బర్త్‌ సర్టిఫికెట్‌ లేకపోయినట్లయితే ఆస్పత్రి నుంచి ఇచ్చే డిశ్చార్జ్‌ సమ్మరీ అయినా పర్వాలేదు.

అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్‌ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుపథం నుంచి దర్శనానికి అనుమతి ఉంటుంది.

Read Also : Indigestion: వేసవిలో అజీర్తి నివారణకు ఇవి తినండి..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News