HomecinemaPrabhas : తిరుపతిలో ఆదిపురుష్‌ సినిమా ప్రీరిలీజ్ వేడుక సందడి స్టార్ట్..

Prabhas : తిరుపతిలో ఆదిపురుష్‌ సినిమా ప్రీరిలీజ్ వేడుక సందడి స్టార్ట్..

Telugu Flash News

Prabhas : తిరుపతిలో ఆదిపురుష్‌ సినిమా ప్రీరిలీజ్ వేడుక సందడి స్టార్ట్ అయ్యింది . ఈరోజు 06-06-2023 న సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.

ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలో హీరో ప్రభాస్,చిత్ర యూనిట్‌తో సహా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రభాస్‌ను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్‌ వద్ద మహా ద్వారం నుంచి బయటకు వస్తున్న భక్తులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. అతి కష్టం మీద ప్రభాస్ ను గుడి ముందు నుంచి రాం భాగిచా గేటు వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కు చేరుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ బస చేసిన గెస్ట్ హౌస్ కు కూడా అభిమానులు చేరుకున్నారు.

అతిథి గృహం చుట్టూ భక్తుల సందడి నెలకొంది. దర్శన సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనయుడు ప్రభాస్ వెంట ఉన్నారు. చిత్ర యూనిట్ కాసేపట్లో తిరుపతికి వెళ్లి సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననుంది. ఈ లైవ్ టెలికాస్ట్ సాయంత్రం 5 గంటల నుంచి వివిధ చానెల్ లలో ప్రసారం కానుంది.

read more news :

Prabhas : ప్రభాస్ కొత్త ఫామ్ హౌస్ కి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

-Advertisement-

Prabhas : సలార్, ఆదిపురుష్ తో అభిమానులలో భారీ అంచనాలు ? బాలీవుడ్ బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేస్తాడా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News